ఒకే దేశం – ఒకే పన్ను: GST ఆరంభం

modi-gstదేశ వ్యాప్తంగా జీఎస్టీ అమల్లోకి వచ్చింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. గంట మోగించి జీఎస్టీని అమల్లోకి తెచ్చారు. అంతకు ముందు మాట్లాడిన రాష్ట్రపతి ప్రణబ్… జీఎస్టీ ప్రారంభానికి దేశ ప్రజలంతా సాక్షులమన్నరు. గతంలో ఆర్థిక మంత్రిగ పని చేసిన తాను కూడా.. జీఎస్టీ రూపకల్పనల భాగం పంచుకున్ననని ప్రణబ్ గుర్తు చేసుకున్నరు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వారధిగా జీఎస్టీ కౌన్సిల్ బాగ పని చేసిందని ప్రశంసించారు. ఇందుకు.. కౌన్సిల్ ను ప్రత్యేకంగ అభినందిస్తున్న అన్నరు. దేశ చరిత్రలో చారిత్రకమైన మార్పునకు.. జీఎస్టీ నాంది పలికిందన్నారు. పారదర్శకమైన పన్ను విధానాలు.. ఇకపై దేశంలో ఒకే రకంగా అమలు కాబోతున్నట్టు చెప్పారు… రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ.
రాష్ట్రపతికి ముందు.. ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడారు. జీఎస్టీ అంటే.. గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ మాత్రమే కాదని.. గుడ్ అండ్ సింపుల్ టాక్స్ అనీ.. ప్రధాని అన్నరు. ఒకప్పుడు.. దేశానికి స్వాతంత్రం సాధించిన సందర్భానికి సాక్షిగ నిలిచిన పార్లమెంట్ సెంట్రల్ హాల్.. ఇప్పుడు కీలక ఆర్థిక సంస్కరణ అయిన జీఎస్టీకి గూడ సాక్షిగ నిలిచిందన్నరు. జీఎస్టీ ప్రారంభానికి పార్లమెంట్ సెంట్రల్ హాల్ ను మించిన ప్రదేశం లేదని ఉద్వేగంగ చెప్పారు. ఏ ఒక్కరి వల్లో.. ఏ ఒక్క ప్రభుత్వం వల్లో జీఎస్టీ అమలు సాధ్యం కాలేదని.. ప్రభుత్వాలు, ప్రజలు కలిసి కృషి చేస్తేనే.. ఈ ఘనత సాధ్యమైందని అన్నరు. ఇది మహానుభావుల కృషి ఫలితంగానే సాధ్యమైందని చెప్పారు. ఇప్పటి వరకూ 18 సార్లు సమావేశమైన జీఎస్టీ కౌన్సిల్.. పారదర్శక పన్ను విధానాన్ని రూపొందించిందని అభినందించారు. ఇన్నాళ్లూ రాష్ట్రానికి ఒక రకంగా పన్నులు అమల్లో ఉండేవని.. ఇప్పుడు ఆ విధానానికి జీఎస్టీతో ముగింపు పలికామని చెప్పారు.. ప్రధాని మోడీ.
ప్రధాని కంటే ముందు మాట్లాడిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ… దేశ చరిత్రల కీలక ఆర్థిక సంస్కరణ.. గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ అమలు అన్నరు. ఇకపై మనది ఒకే దేశం.. ఒకే టాక్స్ సిస్టమ్ అని చెప్పారు. దేశ ప్రజలకు విస్తృత ప్రయోజనాలు కల్పించడమే.. జీఎస్టీ అమలు ఉద్దేశమన్నరు. జీఎస్టీ కౌన్సిల్.. రాష్ట్ర ప్రభుత్వాలతోని అన్ని రకాలుగ సంప్రదింపులు చేసి.. అందరి అభిప్రాయాలు తీసుకున్నంకనె.. పన్ను విధానాన్ని ఫైనల్ చేసిందన్నరు. జీఎస్టీ అమలుతోని.. అన్ని వర్గాలకు మేలు జరుగుతుందన్న జైట్లీ.. దేశ జీడీపీ గూడ పెరుగుతుందన్నరు. జైట్లీ తర్వాత ప్రధాని మోడీ, రాష్ట్రపతి ప్రణబ్ ప్రసంగించారు. ఆ వెంటనే.. రాష్ట్రపతి, ప్రధాని కలిసి బజర్ ప్రెస్ చేసి జీఎస్టీని అమల్లోకి తెచ్చారు.



Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy