ఒక్కటైన జేడీయూ, ఆర్జేడీ..!!

lalu-nitishబీహార్ లో బీజేపీ కి బ్రేకులు వేయడానికే

బీహార్ లో ఎన్నికల పొత్తు పొడిచింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కలసి పోటీ చేయాలని జేడీయూ, ఆర్జేడీలు డిసైడయ్యాయి. బీహార్ లో బీజేపీకి బ్రేకులు వేయడమే టార్గెట్ గా ఈ పొత్తు ఏర్పడింది. మోడీ హవాను తగ్గించి బీహార్ పీఠంపై జనతా జెండా ఎగరేసేందుకు రెండు పార్టీలు ఫైట్ చేయనున్నాయి. ఇక సీట్ల సర్దుబాటుపై ఆరుగురు సభ్యులతో ఒక కమిటీ ఏర్పాటు చేయాలని నితీష్, లాలూలు నిర్ణయించారు. ఈ కమిటీలో రెండు పార్టీల నుంచి ముగ్గురేసి మెంబర్లుంటారు. సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ ఢిల్లీలోని ఇంట్లో నితీష్ కుమార్, లాలూల మధ్య మంతనాలు జరిగాయి. ములాయం సమక్షంలో రెండుగంటల పాటు ఇద్దరు నేతలు చర్చలు జరిపారు. ఎంతో కాలం నుంచి పెండింగ్ లో ఉన్న ఈ అంశం పరిష్కారం కోసం రెండు పార్టీల మధ్య ములాయం మధ్యవర్తిత్వం వహించారు. అయితే సీఎం క్యాండిడేచర్ పై మాత్రం క్లారిటీ రాలేదు. దీనిపై ఎలాంటి వివాదం లేదని… సీట్ల సర్దుబాటే ముఖ్యమని సమాజ్ వాదీ పార్టీ ప్రధాన కార్యదర్శి రాంగోపాల్ యాదవ్ చెప్పారు. త్వరలోనే దీనిపై రెండు పార్టీల నాయకులు ఓ నిర్ణయానికి వస్తారన్నారు.

ఇక అంతకుముందు నితీష్ కుమార్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీని కలిశారు. రాహుల్ ఇంటికి వెళ్లిన నితీష్ గంటన్నరపాటు చర్చలు జరిపారు. ఆ తర్వాతే ములాయం ఇంట్లో లాలూతో భేటీ అయ్యారు. ఇక ఇవాళ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలవనున్నారు లాలూ ప్రసాద్ యాదవ్. జేడీయూతో పొత్తు, ఎన్నికలపైనే ఆమెతో మాట్లాడతారని సమాచారం. ఇక ఆర్జేడీ, జేడీయూల మధ్య సీట్ల సంఖ్యపై నేషనల్ మీడియాలో అనేక స్పెక్యులేషన్స్ వస్తున్నాయి. మొత్తం 243 అసెంబ్లీ సీట్లకు ఆర్జేడీ, జేడీయూ చెరో 100 స్థానాలు, మరో 43 స్థానాలను కాంగ్రెస్, NCP, సీపీఐ, సీపీఎం పార్టీలకు కేటాయిస్తారని టాక్.

 

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy