ఒక్కరు కూడా అడ్డుకోలేదు : ప్రేమించినందుకు యువతిని కట్టేసి కొట్టారు

women
బీహార్ లో చారిత్రక నేపథ్యమున్న చంపారన్ జిల్లాలో అమానుషం వెలుగుచూసింది. ప్రేమించిన పాపానికి ఓ యువతిని కట్టేసి కొట్టారు నలుగురు యువకులు. వెస్ట్ చంపారన్ లోని బాగహా జిల్లా… నౌరంగియా పోలీస్ స్టేషన్ పరిధిలో కతయ్యా గ్రామంలో జరిగిందీ దారుణం. స్నేహితురాలి ఇంటికెళ్లగా అక్కడే పట్టుకుని కట్టేసి కొట్టారు. యువతిని కొడుతుండగా గ్రామస్థులంతా కళ్లప్పగించి చూశారు తప్ప ఏ ఒక్కరూ అడ్డుకోలేదట. ఎవరో పోలీసులకు సమాచారమిస్తే వచ్చి రక్షించారు. తీవ్ర గాయాలతో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అమ్మాయి పరిస్థితి బానే ఉందన్నారు డాక్టర్లు. గురువారం జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకొచ్చింది.  ఈ కేసులో నలుగురు యువకులను అరెస్ట్ చేశారు పోలీసులు. బీహార్ లోని మారుమూల గ్రామాల్లో ఇలాంటి ఘటనలు ఊరిలోనే పరిష్కారమవుతుంటాయని.. ఎవరో ఒకరు సమాచారమిస్తే తప్ప వెలుగుచూడవంటున్నారు పోలీసులు. అందుకే ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత యువకులను అరెస్ట్ చేశామంటున్నారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy