ఎమ్మెల్సీ సీటు కోసం టీడీపీ ఎత్తులు..!

Chandrababu Naidu TDP Telangana_0MLA కోటాలో MLC సీట్ల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. మొత్తం 6 సీట్లలో 4 సీట్లు అధికార పార్టీకి పోగా…ఒకటి కాంగ్రెస్ కు దక్కనుంది. దీంతో మిగిలిన ఒక్కదానికి అధికార పార్టీ అభ్యర్దిని నిలబెట్టకపోతే.. TDPకి ఈ ఛాన్స్ దక్కనుంది. మొత్తం 11 మంది ఎమ్మెల్యేల బలమున్న TDP ఒక్క సీటును దక్కించుకునేందుకు ప్లాన్ చేస్తోంది. ఒక్క సీటు కోసం ట్రిక్స్ ప్లే చేస్తున్న తమ్ముళ్లు… మిత్రపక్షమైన బీజేపీ బలం… తమకు కలిసి వస్తుందనే అంచనాలో ఉన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసి దారికి తెచ్చుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. అక్కడికి వర్క్ అవుట్ కాకుంటే…వామపక్షాల మద్దతు కోరేందుకు సిద్దమవుతున్నారు.

MLC సీటుపై గంపెడాశలు పెట్టుకున్నారు అశావాహులు. అందివచ్చే అవకాశాన్ని తమకు అనువుగా మార్చుకునేందుకు పావులు కదుపుతున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన నేతలతో పాటు మహిళలు ఈ ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే లిస్ట్ ను అధినేతకు పంపించారు. ఇదే ఇప్పుడు అధినేతకు తలనొప్పిగా మారింది. దీనికి తోడు దళిత సామాజిక వర్గం బాబును డైలమాలో పడేస్తోంది. ఎమ్మెల్సీ నోటిఫికేషన్ ముగింపు గడువుకు టైం దగ్గర పడుతుండటంతో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు నేతల పాట్లు అన్నిఇన్నీకావు. అయితే ఆ ఒక్కఛాన్స్ ఎవరికి ఇస్తారనేది మాత్రం సస్పెన్స్ గా మారింది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy