ఒక్క చలానా పెండింగ్ లో ఉన్నా…

Road-Offencesఒక్క చలానా పెండింగ్ లో ఉన్నా అదనపు చార్జీలను వేసేందుకు ట్రాఫిక్ పోలీసులు రెడీ అవుతున్నారు. దీనికోసం న్యాయమూర్తులను అభ్యర్ధించనున్నారు. ట్రాఫిక్ చలానాలు పెండింగ్ లో ఉన్నా.. నాలుగైదు చలానాలు కట్టకున్నా..వాటిని వెంటనే చెల్లించాలని వాహనదారులను హెచ్చరిస్తున్నారు పోలీసులు. లేదంటే ట్రాఫిక్ పోలీసులు మీపై కోర్టుల్లో అరోపణ పత్రాలు సమర్పిస్తారు. అంతేకాదు మీరు చెల్లించాల్సిన జరిమానాలకు అదనంగా మరింత వడ్డించండి అంటూ న్యాయమూర్తులను అభ్యర్ధించనున్నారు. అంతేకాదు రెండు సార్లు పోలీస్ శిక్షణ కేంద్రానికి వెళ్లి ప్రమాదాలు చేస్తే ఎలాంటి పరిణామాలుంటాయన్న అంశాలను చూడాలి. ఇవన్నీ చేస్తేనే తప్ప వీ వాహనం మీ చేతుల్లోకి రాదు. రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న క్రమంలో ట్రాఫిక్ పోలీసు ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒకటి రెండు రోజుల్లో పెండింగ్ చలానాలున్న వాళ్లు వారి వివరాలను సేకరించి తర్వాత చర్యలు చేపట్టనున్నారు.

ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తున్న వారిని గుర్తించి వారిపై మోటారు వాహన చట్టం ప్రకారం కేసులు నమోదు చేస్తున్నారు పోలీసులు. చలానాలను ఇంటికి పంపి…ఇందులో ఎవరు చెల్లిస్తున్నారు.. ఎవరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు తెలుసుకుంటున్నారు. పెండింగ్ చలానాలు ఎక్కువగా ఉండే వాహనాలను గుర్తించి పోలీసుల తనిఖీల్లో ఆపుతున్నారు.

నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం..సెల్ ఫోన్ డ్రైవింగ్, ప్రమాదాలు చేయడం వంటివి మోటారు వాహన చట్టం ప్రకారం నేరం. వీటన్నింటిపై ట్రాఫిక్ పోలీసుఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడంతో పాటు జైలు శిక్ష పడుతుందని హెచ్చరిస్తున్నారు. రవాణా శాఖ సర్వర్ లో రికార్డులను అనుసంధనించడంతో 12 పాయింట్లు లెక్కలు వస్తాయంటూ చెబుతున్నారు. ఇప్పటికే 12 పాయింట్లు దాటేసిన వారి వివరాలు పోలీసుల దగ్గర ఉన్నాయి. పాయింట్ల తో పాటు జరిమానాలు చెల్లించకపోతే…జైలు శిక్షలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy