ఒక్క డైలాగ్‌తో ఇంట‌ర్నెట్ సెన్సేష‌న్ అయ్యింది

111కొద్ది రోజుల క్రితం ఓ మ‌హిళ‌ పాక్ ప్ర‌భుత్వాన్ని ఏకిపారేస్తున్న లైవ్ వీడియో సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేసింది. ఇప్పుడు అదే మ‌హిళ మ‌రోసారి ఇంట‌ర్నెట్ సెన్సేష‌న్ అయ్యింది. విప్ల‌వ‌కారుడు చెగోవెరా ఫోటోను మార్ఫ్ చేస్తూ ఆయ‌న ముఖం తీసేసి ఈ మ‌హిళ ముఖాన్నిపెట్ట‌డంతో ఈ ఫోటో సెన్సేష‌న్ అయ్యింది. అంతేకాదు ఆ మ‌హిళ పాక్ ప్ర‌భుత్వాన్ని తిడుతూ వాడిన ఒక పాపుల‌ర్ డైలాగ్ ఏ బిక్ గ‌యీ హై గార్మింట్ ను ఈ పోస్ట‌ర్‌పై రాశారు. ఆ మ‌హిళ పాక్ ప్ర‌భుత్వాన్ని తిడుతున్న వీడియోను ప‌లుర‌కాలుగా ఎడిట్ చేసి సోష‌ల్‌మీడియాలో అప్‌లోడ్ చేశారు. అయితే ఏ బిక్ గ‌యీ హై గార్మింట్ డైలాగ్‌తో ఉన్న చెగోవెరా పోస్ట‌ర్ మాత్రం చాలా పాపుల‌ర్ అయ్యింది.

అమెరికా అధ్య‌క్షుడిగా ట్రంప్‌ను వ్య‌తిరేకిస్తూ చాలాచోట్ల నిర‌స‌న‌లు వ్య‌క్త‌మ‌య్యాయి. ఆ నిర‌స‌న ర్యాలీల్లో ఈ మ‌హిళతో పాటు ఆమె డైలాగ్  ఉన్న పోస్ట‌ర్ ను నిర‌స‌న‌కారులు ప్ర‌ద‌ర్శించ‌డంతో మ‌రింత పాపుల‌ర్ అయ్యింది. అంతేకాదు చాలామంది నెటిజెన్లు ఈ పోస్ట‌ర్‌ను సోష‌ల్‌మీడియాలో మెమ్స్‌లా ఉప‌యోగిస్తున్నారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy