ఒక్క ఫైట్ కు ఇంత ఖర్చా..!

ROBOడైరెక్టర్ శంకర్ సినిమా అంటేనే భారీ బడ్జెట్ …హై  టెక్నాలజీ ఉంటుంది. సూపర్‌స్టార్‌ రజనీకాంత్, శంకర్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘రోబో’ బాక్సాఫీసు దగ్గర ఎన్ని వసూళ్లు రాబట్టిందో తెలిసిందే. ఆ చిత్రానికి సీక్వెల్‌గా అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘2.0’ తెరకెక్కుతోంది. ఇప్పటి వరకూ సౌత్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో తెరకెక్కని అత్యంత భారీ బడ్జెట్‌తో సుమారు 450కోట్లతో ఈ చిత్రం నిర్మిస్తున్నారట. ఈ చిత్రంలో బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ విలన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ముంబైలో జరుగుతోంది.

రజనీ,అక్షయ్‌ల మధ్య ఏరియల్‌ స్టంట్‌ విధానంలో ఓ ఫైట్‌ చిత్రీకరించేందుకు సుమారు 20 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని సమాచారం. ఒక్క ఫైట్‌కు 20 కోట్లా? అని కోలీవుడ్‌లో చర్చించుకుంటున్నారు. ఈ ఫైట్‌ బాగా రిచ్‌గా రావడానికి హాలీవుడ్‌కి చెందిన ప్రముఖ స్టంట్‌ మాస్టర్లను ముంబై పిలిపించారట. హాలీవుడ్‌ రేంజ్‌కి ఏ మాత్రం తగ్గకుండా రజనీ,అక్షయ్‌ల మధ్య ఫైట్‌ ఉంటుందని, ఈ సినిమాలో ఈ పోరాటమే హైలెట్‌ అని చిత్ర బృందం చెబుతోంది. ఇందులో రజనీ సరసన ఎమీ జాక్సన్‌ హీరోయిన్ గా నటిస్తోంది. ఏఆర్‌ రహమాన్‌ మ్యూజిక్ అందిస్తున్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy