ఒక్క మిస్డ్‌ కాల్‌తో PF బ్యాలెన్స్‌

EPFఉద్యోగస్తులకు కేంద్ర ప్రభుత్వం మరో వెసులుబాటును కల్పించింది. కేవలం ఒక్క మిస్డ్‌ కాల్‌తోనే ప్రావిడెంట్‌ ఫండ్‌(PF) బ్యాలెన్స్‌ ఎంత ఉందో తెలుసుకునే వీలు కల్పించింది. ఉద్యోగస్తులు PF బ్యాలెన్స్‌ వివరాలను సులువుగా పొందడానికే ఈ టెక్నాలజీని ప్రవేశపెట్టినట్లు కేంద్ర కార్మిక శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ ఎంప్లాయీస్‌(EPF) స్కీమ్‌లోని ఉద్యోగులు ఎవరైతే యూనివర్సల్‌ అకౌంట్‌ నెంబర్‌(UAN) పోర్టల్‌లోనూ రిజస్టర్‌ అయి ఉంటారో వారు ఈ సేవలను వినియోగించుకోవచ్చు. అంటే బ్యాంక్‌ బ్యాలెన్స్‌ వివరాలు పొందే మాదిరిగానే PF బ్యాలెన్స్‌ వివరాలనూ తెలుసుకోవచ్చన్న మాట. UAN పోర్టల్‌లో ఉద్యోగులు తెలిపిన తమ ఫోన్‌ నెంబర్‌ నుంచి 011-22901406 కు మిస్డ్‌ కాల్‌ ఇస్తే చాలూ.. వెంటనే వివరాలు ఎస్‌ఎంఎస్‌ ద్వారా అందుతాయి. ఈ సర్వీస్‌కు ఎలాంటి చార్జీలు ఉండబోవని కార్మిక శాఖ తెలిపింది. అదే విధంగా రిజిస్టర్‌ మొబైల్‌ నెంబర్‌ నుంచి ‘EPFOHO UAN’ అని టైప్‌ చేసి 7738299899 నెంబర్‌కు ఎస్‌ఎంఎస్‌ చేయడం ద్వారా కూడా వివరాలు పొందవచ్చు. ఇంగ్లీష్‌, హిందీతో పాటు మరో 8 భారతీయ భాషల్లో బ్యాలెన్స్‌ వివరాలు పొందవచ్చని కేంద్ర కార్మిక శాఖ చెప్పింది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy