ఒక్క సహకార బ్యాంకులో రూ.266 కోట్లు డిపాజిట్

black-moneyమోడీ నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న తర్వాత నల్ల కుబేరులు తమ అక్రమ సొమ్మును పేదల జన్‌ధన్ అకౌంట్లలోకి, సహకార బ్యాంకుల్లోకి పెద్ద ఎత్తున తరలించారు. కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఐటీ దాడుల్లో కొన్ని వందల కోట్లు పట్టుబడ్డాయి. ఇన్నాళ్లు నగరాల్లోని బ్యాంకులపై నిఘా పెట్టిన నిఘా సంస్థలు ఇప్పుడు సహకార బ్యాంకులపై దృష్టి పెట్టాయి. తాజాగా కేరళలోని మలప్పురం జిల్లా కోఆపరేటివ్ బ్యాంకుపై సీబీఐ డిసెంబర్ 22వ తేదీన దాడి చేసి,  పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే వివరాలను పరిశీలించిన సీబీఐ అధికారులు కంగుతిన్నారు.

మలప్పురం జిల్లా సహకార బ్యాంకులో 266 కోట్ల రూపాయల డబ్బును డిపాజిట్ చేసినట్లు గుర్తించారు సీబీఐ అధికారులు. ఈ డబ్బును అధికారులు సీజ్ చేశారు. వందల కోట్ల డబ్బుకు ఎలాంటి లెక్కాపత్రం లేవని తేల్చారు. నవంబర్ 10 నుంచి 14 వరకూ పెద్ద ఎత్తున డిపాజిట్ చేసినట్లు అధికారుల విచారణలో తెలిసింది. త్వరలో డిపాజిట్ చేసిన వారి బ్యాంకు ఖాతా వివరాలను సమర్పించాలని బ్యాంకు అధికారులను ఆదేశించింది సీబీఐ. RBI నిబంధనలను ఉల్లంఘించిన మలప్పురం బ్యాంకు సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు సీబీఐ అధికారులు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy