ఒక చరిత్రకు నాంది ఇవాళే…

AMARAVATHI 475

ఓ చరిత్రకు నాంది ఇవాళే…

ఓ చరిత్రకు తొలి అడుగుపడనుంది. రెండు పండుగలకు ఆంధ్రప్రదేశ్ సిద్ధమైంది. దసరా కంటే ఎక్కువగా.. రాజధాని అమరావతి శంకుస్థాపనను సెలబ్రేట్ చేసుకునేందుకు రెడీ అయ్యింది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ నవ్య రాజధానికి పునాదిరాయి వేయనున్నారు. దేశ, విదేశీ ప్రముఖులు వేడుకకు అటెండ్ కానున్నారు.

నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపనను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది ఏపీ ప్రభుత్వం. చరిత్రలో చిరస్థాయిగా నిలిచేలా భారీ ఏర్పాట్లు చేసింది. ఉద్దండరాయునిపాలెంలో రాజధాని శంకుస్థాపనకు అంతా సిద్ధమైంది. ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రులు, గవర్నర్ నరసింహన్, రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అటెండ్ అవుతున్నారు.  విదేశాలకు నుంచి కూడా ప్రత్యేక అతిథులు రానున్నారు.

అమరావతి గీతాలాపనతో…

ఉదయం 9.45కు… గుమ్మడి గోపాల కృష్ణ రాసిన అమరావతి గీతాలాపనతో శంకుస్థాపన ప్రోగ్రామ్ స్టార్టవుతుంది. ఆ తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు కంటిన్యూ అవుతాయి. డ్రమ్మర్ శివమణి స్పెషల్ షోకు ప్లాన్ చేశారు. అమరావతి నిర్మాణ మహోత్సవానికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తమవంతు సహకారం అందిస్తోంది. మధ్యాహ్నం  ప్రధానమంత్రి మోడీ వచ్చాక.. అధికారిక కార్యక్రమం మొదలవుతుంది.

తరలివస్తున్న అతిరథ మహారథులు….

సభాప్రాంగణంలో లక్షా యాభైవేల మంది కుర్చునేలా కుర్చీలు అరెంజ్  చేశారు. మూడు ప్రధాన వేదికలు అరెంజ్ చేశారు. మెయిస్ స్టేజీపై ప్రధానితో పాటు  ఏపీ సిఎం చంద్రబాబు, తెలంగాణా సిఎం కేసీఆర్, పంజాబ్ రాష్ట్ర సీఎం ప్రకాశ్  సింగ్ బాదల్, తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్, తమిళనాడు గవర్నర్ కె.రోశయ్య, అసోం గవర్నర్ పద్మనాభ బాలకృష్ణ ఆచార్య, కేంద్రమంత్రులు అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరీ, నిర్మలా సీతారామన్, వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ, సుప్రీం కోర్ట్ న్యాయమూర్తులు జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ జాస్తీ చలమేశ్వర్, హైకోర్ట్ ప్రదాన న్యాయమూర్తి జస్టిస్ బి.దిలీప్ బాబాసాహెబ్ భోసాలే, సింగపూర్ మంత్రి ఈశ్వరన్,  జపాన్ మంత్రి యోసుకే తకాగి మొత్తం 17మంది ఉంటారు.

వేడుక సాగనుంది ఇలా….

గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి  హెలికాఫ్ఠర్ లో  12:30కి శంకుస్థాపన స్థలానికి  చేరుకుంటారు ప్రధాని. 12:35కు అమరావతి ఫైలాన్ ను సందర్శిస్తారు. 12:35నుంచి 12:43 మధ్యలో  శంకుస్థాపన పూజలో పాల్గొంటారు. 12:50 నుంచి  12: 53 వరకు  జపాన్ మంత్రి యోసుకే  తకాగి మాట్లాడతారు. .12:53నుంచి  12: 56వరకు సింగపూరు మంత్రి ఈశ్వరణ్ మాట్లాడతారు. 12:56నుండి 01:01వరకు కేంధ్ర పట్టణాభివద్ది శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ప్రసంగిస్తారు. 01:01నుంచి  01:11వరకు ఏపీ సిఎం చంధ్రబాబు మాట్లాడతారు.  ప్రదాని నరేంధ్ర మోధి 01:11నుంచి  1:43వరకు 32నిమిషాల సేపు ప్రసంగిస్తారు. సీఎం కేసీఆర్ కూడా మాట్లాడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

12 దేశాల  రాయబారులు , రాష్ట్ర, దేశ, విదేశాల ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు సభలో పాల్గొంటారు.   రాజధానికి భూములు ఇచ్చిన 33వేల మంది రైతులకు మొదటి వరుసలో కూర్చునే అవకాశం కల్పించారు. చెక్కెర పొంగలీ, పులిహోరా, తాపేశ్వరం కాజా, దద్దోజనం, అరటిపండు రెండు నీటి ప్యాకెట్లు ప్యాకేజ్ గా చేసి సభకు వచ్చిన జనానికి అందించున్నారు.

భారీ భద్రతా ఏర్పాట్లు

శంకుస్థాపన కార్యక్రమానికి 14 వేలమంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. 12 మంది ఐపీఎస్ లు సెక్యూరిటీని పర్యవేక్షిస్తుంటారు. రాజధాని ప్రాంతంలో నిన్న  ప్రత్యేక పూజలు చేసిన చంద్రబాబు అన్ని పుణ్యక్షేత్రాలనుంచి తీసుకొచ్చిన మట్టిని, నీటిని అమరావతి నిర్మాణ ప్రాంతంలో హెలికాప్టర్ నుంచి చల్లారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy