ఒగ్గు కథకు ప్రాణం.. రాములన్న

middeమిద్దె రాములు… ఒగ్గు కథకు పెట్టింది పేరు. 1942లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం హన్మాజీపేటలో జన్మించారు. తల్లిదండ్రులకు ఐదుగురు సంతానంలో .. రాములు చిన్నవాడు. స్వయం కృషితో ఒగ్గుకథ నేర్చుకున్నాడు. గీతకార్మిక కుటుంబంలో జన్మించిన రాములు.. కథ చెప్పే తీరుకు ఎవరైనా మంత్ర ముగ్ధులు కావాల్సిందే.

40 ఏళ్లకు పైగా కథా ప్రస్థానంలో … ఒగ్గు కథకు రాములు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయారు. ఉత్తర తెలంగాణ పల్లెల్లో మిద్దె రాములు కథ తెలియనివాళ్లుండరు. పల్లెను, ఊరి జీవితాన్ని జానపద కళలతో ప్రదర్శించేవారు. పురాణాలను, సాహితీ విషయాలను ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడం ఆయనకే చెల్లింది. జనరంజకంగా కథ చెప్పడం రాములుకే సొంతం. తెలంగాణలో ఆయన  ప్రేరణతో ఎంతోమంది కళాకారులు పుట్టుకొచ్చారు.

ఎల్లమ్మ కథ, సారంగధర, ఐదు ఓల్లె పూలు, గంగా గౌరి కథలు, చారిత్రక గాథలు అద్భుతంగా చెప్పే వారు. తెలంగాణ ఉద్యమానికి బోనం సింబాలిజం చేసింది కూడా మిద్దె  రాములే. తెలంగాణ ధూంధాం కార్యక్రమాల్లో ఆయన బోనం నెత్తిన పెట్టుకుని ప్రదర్శనలు చేశాడు. అప్పటి నుంచి ఏ సభలో చూసినా బోనం కనిపించడం కామన్ గా మారిపోయింది.

ఈ తరానికి ఆదర్శనీయులుగా ఉన్నారు. ఎంతో మందిని అలరించిన ఆ గొంతు… 2010 నవంబర్ 25న మూగబోయింది. భౌతికంగా మిద్దె రాములు మనలో లేకున్నా.. ఆయన చెప్పిన ఒగ్గు కథలు.. జనం చెవుల్లో మార్మోగుతూనే ఉన్నాయి.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy