ఒగ్గు కథ స్టైల్‌ లో అనసూయ ‘స‌చ్చింది రా గొర్రె’

Anasuya-Imagesబుల్లితెర‌పై యాంకర్ గా  అల‌రించిన అన‌సూయ ‘క్ష‌ణం’ సినిమాతో వెండితెర‌కి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మూవీలో అన‌సూయ కామియో రోల్ పోషించ‌గా, ఆమె న‌ట‌న‌కి మంచి మార్కులు ప‌డ్డాయి. ఇక ఆ త‌ర్వాత ‘సోగ్గాడే చిన్ని నాయ‌నా’ లోను మెరిసింది ఈ అమ్మ‌డు. రీసెంట్‌గా సాయిధ‌ర‌మ్ తేజ్ న‌టించిన విన్న‌ర్ మూవీలో స్పెష‌ల్ సాంగ్ చేసి యూత్‌కి కంటిపై కునుకు లేకుండా చేసింది హాట్ బ్యూటీ అను. ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తున్న ‘రంగ‌స్థ‌లం 1985’ లో ఓ స్పెష‌ల్ క్యారెక్ట‌ర్ చేస్తుంది. అయితే తొలిసారి ఫీమేల్ లీడ్ పాత్ర‌లో అన‌సూయ ‘స‌చ్చింది రా గొర్రె’ అనే సినిమా చేస్తుంది. ఈ మూవీ శ్రీధ‌ర్ రెడ్డి యార్వా ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతుండ‌గా, క్రైమ్‌ కామెడీ జోనర్‌ లో తెర‌కెక్కిస్తున్నారు. తెలంగాణకు చెందిన ఒగ్గు కథ స్టైల్‌ నేరేషన్‌తో ఈ మూవీ ఉంటుందని అన‌సూయ తెలిపింది. శ్రీనివాసరెడ్డి, రవిబాబు, టిల్లూ వేణు, రాకేష్‌, శివారెడ్డి, సత్యవతి, కోట శంకర్రావు ముఖ్యతారాగణంగా రూపొందుతున్న ఈ మూవీ డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. సోహం రాక్‌స్టార్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ స్టూడియో సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy