ఒప్పో ఫోన్లకు అదనంగా జియో 100GB డేటా

jio-oppoరిలయన్స్ జియో సంస్థతో ..ఒప్పోతో భాగస్వామ్యం ఏర్పరుచుకుంది. ఈ భాగస్వామ్యంలో తన జియో యూజర్లకు అదనపు డేటాను ఆఫర్‌ చేస్తున్నాయి. రూ.309, ఆపై మొత్తాల జియో రీఛార్జ్‌లకు 100జీబీ వరకు అదనపు డేటాను జియో 4జీ స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలుదారులు పొందనున్నారు. ఈ ఆఫర్‌ 2017 అక్టోబర్‌ 27 నుంచి 2018 మార్చి 31 వరకు అందుబాటులో ఉంటుంది.

ఒప్పో ఎఫ్5, ఎఫ్3, ఎఫ్3 ప్లస్, ఎఫ్1 ప్లస్ యూజర్లు జియోలో రూ.309 ఆపైన విలువ గల ప్లాన్లతో రీచార్జి చేసుకుంటే రీచార్జికి 10జీబీ 4జీ డేటా చొప్పున మొత్తం 10 సార్లు చేసే రీచార్జిలకు గాను 100 జీబీ డేటాను పొందవచ్చు. అలాగే ఒప్పో ఎఫ్1ఎస్, ఎ33ఎఫ్, ఎ37ఎఫ్, ఎ37ఎఫ్‌డబ్ల్యూ, ఎ57, ఎ71 ఫోన్లను వాడుతున్న యూజర్లు కూడా రూ.309 ఆపైన విలువ గల ప్లాన్లతో రీచార్జి చేసుకుంటే రీచార్జికి 10జీబీ డేటా చొప్పున మొత్తం 6 సార్లు చేసే రీచార్జిలకు గాను 60 జీబీ డేటాను పొందవచ్చు.

ఈ ఆఫర్‌ రిడీమ్‌ చేసుకునే విధానం…

….మొదట ఒప్పో స్మార్ట్‌ఫోన్‌లో మైజియో యాప్‌ ఓపెన్‌ చేయాలి

….తర్వాత మై వోచర్స్‌ సెక్షన్‌లో రిడీమ్‌ ఐకాన్‌పై క్లిక్‌ చేయాలి

….కిందవైపున్న రీఛార్జ్‌ బటన్‌ క్లిక్‌ చేయాలి

….ఒక్కసారి రీఛార్జ్‌ చేసుకోవడం అయిపోయిన తర్వాత, వోచర్‌ రిడెంప్షన్‌ విజయవంతమైనట్టు కన్ఫాం అవుతుంది

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy