ఒబామా.. చాలా సింప్లిసిటీ మామ

obamaఒబామా…. అమెరికా ప్రెసిడెంట్ . వైట్ హౌస్ లో రోజంతా అధికారిక  కార్యక్రమాలతో  ఫుల్ బిజీగా ఉంటారు. రాజభోగాలు అనుభవిస్తుంటారు అనుకుంటాం. నిజమే.. అమెరికా అధ్యక్షుడు అంటే అలాగే ఉంటాడు మరి. అయితే అదంతా వన్ సైడ్ షో.. ఆన్ స్క్రీన్ మ్యాటర్.. మరి  ఆఫ్ స్క్రీన్ ఒబామా ఏం చేస్తారు..? ఆయన పర్సనల్ లైఫ్ లో  ఎలా ఉంటారు..? వైట్ హౌజ్ బాస్ లో మనకు తెలియని విషేశాలేంటో తెలుసా..

రూపాయికి బొమ్మాబొరుసు ఉన్నట్టే  ప్రతి మనిషిలోనూ ఇద్దరుంటారు అని చెబుతుంటారు. అది బయటికి వచ్చినప్పుడే అసలు అతనేంటి అనేది తెలుస్తుందంటారు. ఈ మాట ఎంత నిజమనేది బరాక్ ఒబామాను చూస్తే చెప్పొచ్చు. సింప్లిటీకి  లివింగ్ ఎగ్జాంపుల్ గా ఉంటారు ఈ శ్వేత సౌధం అధినేత.

 

ప్రెసిడెంటా.. కామన్ మ్యానా..!

comman manపబ్లిక్ లో ఉన్నా ప్రైవేట్ ప్రొగ్రామ్స్ కు అటెండ్ అయినా.. ఆఫీస్ లో ఉన్నా.. ఆటవిడుపు అయినా ఒబామా తన మార్క్ చూపిస్తారు. కామన్ పీపుల్ లివింగ్ కి చాలా దగ్గరగా ఉంటారంటే మీరు నమ్ముతారా..? ఇక్కడ చూడండి జనంతో ఎంత బాగా మిక్స్ అవుతున్నారో… హోదాను కూడా పక్కన పెట్టి తనలోని హ్యుమానిటీని చూపిస్తున్నారు.

 

 

 

తనూ ఓ ఉద్యోగిలా…

obama in discussionsబాసిజమ్ అనేది బహుశా ఒబామాకు తెలిసి ఉండకపోవచ్చు అనిపిస్తుంది ఈ ఫొటోలు  చూస్తుంటే. సరదాగా వారితో కలిసిపోతారు. వారి కష్టసుఖాలను పంచుకుంటారు. ఎంతటి డీప్ డిస్కషన్స్ లో ఉన్నా రు సీరియస్ నెస్ అయితే కనిపించదు. విదేశాల నుంచి గెస్ట్ లు వచ్చినా వారితోనూ అంతే భలే సరదాగా ఉంటారు.

 

 

 

పిల్లల్లో పిల్లాడైపోతాడు

obama-child

పిల్లలంటే ఒబామాకు ప్రాణం తన ఇద్దరు కూతుళ్లతో ఎంత జోవియల్ గా ఉంటారో బయటా అంతే. ఇంకా చెప్పాలంటే అంతకంటే ఎక్కువే. తానూ చిన్నపిల్లాడైపోతారు. వారితో ఆడుకుంటూ చిన్న నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటారు. ఇక్కడ చూడండి నేలపై పడుకుని మరీ బుజ్జాయిలను ఎలా ఆడిస్తున్నారో.భలేగా  ఉంది కదూ ఈ లిటిల్ రాస్కెల్స్ తో ఒబమాను చూస్తుంటే.

 

 

ఒబామా మాంచి రొమాంటిక్ ఫెలో

“The First Lady

ఇంతేనా మన ఒబామాలో మాంచి రొమాంటిక్ యాంగిల్ కూడా ఉందండి.  ఫస్ట్ లేడీ మిషెల్లితో చాలా ప్రేమగా ఉంటారు. వీళ్లిద్దరూ ఎక్కడికెళ్లినా సరే ఒక్కటినే ఉంటారు. దూరం అనే మాటే ఉండదు. ఇల్లాలంటే అంత రెస్పాన్సిబులిటీ మరి. ఇదిగో ఇదొక్కటి చాలు వారి మధ్య అటాచ్ మెంట్ గురించి చెప్పడానికి.

 

 

 

ఇదంతా ఓకే… మరి ఒబామా ఒక్కడే ఉన్నప్పుడు ఏం చేస్తాడు.. మీరే చూడండి ఏం చేస్తున్నాడో.

 

obama single

ఒబామా పర్సనల్ ఫొటో గ్రాఫర్ పీటీ సౌజా తీసినవే ఈ ఫొటోలన్నీ. 2015లో ఒబామా మధురస్మృతులను , ఆయన ఫ్యామిలీతో గడిపిన క్షణాలను ఇలా అన్నింటిని తన కెమెరాలో భద్రపరిచి 100కు పైగా ఫొటోలను న్యూఇయర్ కు ఇలా మనకందించారు.  నిజంగా  చాలా బాగున్నాయి కదా.. ఇన్ని ఉన్నాయి మరి ఒమాబాలో, అమెరికా ప్రెసిడెంట్ గానే కాదు.. ఓ భర్తగా, తండ్రిగా, తన సిబ్బందికి ఓ మంచి బాస్ గా మెయిన్ గా పబ్లిక్ తో కామన్ మ్యాన్ ఇలా అన్నింటిలోనూ బరాక్ తన రోల్ ను ఫుల్ ఫిల్ చేస్తున్నారు. ఎక్కడా లోటు రాకుండా హుందాగా నడుచుకుంటున్నారు ఎదిగినా ఒదిగి ఉండాలంటారు కదా దాన్ని అక్షరాలా పాటిస్తున్నారు ఈ వైట్ హౌజ్ బాస్.

ఒబామాలో మరో కోణాన్ని చూపించే మరిన్ని ఫొటోలు మీకోసం….

obama with his officers

obama 1 obama 2 obama 3 obamana in rain

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy