ఒలింపిక్స్ చాంపియన్ పై సైనా ఘన విజయం

saina-nehwalఇటీవలే జపాన్‌ ఓపెన్‌లో రియో ఒలింపిక్స్‌ చాంపియన్‌ కరోలినా మారిన్‌ చేతిలో ఎదురైన పరాజయానికి భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ ప్రతీకారం తీర్చుకుంది. డెన్మార్క్‌ ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ ప్రీమియర్‌ టోర్నమెంట్‌లో ఈ హైదరాబాద్‌ అమ్మాయి శుభారంభం చేసింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో ప్రపంచ 12వ ర్యాంకర్‌ సైనా 22–20, 21–18తో ప్రపంచ 5వ ర్యాంకర్‌ మారిన్‌ (స్పెయిన్‌)ను బోల్తా కొట్టించింది. ఈ గెలుపుతో మారిన్‌తో ముఖాముఖి రికార్డులో సైనా 5–4తో ఆధిక్యంలోకి వెళ్లింది. 46 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఇద్దరూ ప్రతీ పాయింట్‌ కోసం నువ్వా నేనా అన్నట్లు పోరాడారు. అయితే కీలకదశలో సైనా పైచేయి సాధించి విజయాన్ని ఖాయం చేసుకుంది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy