ఒలింపిక్స్ స్థాయికి హైదరాబాద్: కేటీఆర్

hyderbad-ktrఅదిరిపోయేలా హైదరాబాద్. ఒలింపిక్స్ నిర్వహించేంత గొప్పగా నిర్మాణం. కోటి కాదు 10కోట్ల జనాభాకైనా ఆశ్రయమిచ్చేలా మౌలిక వసతులు. ఇవీ హైదరాబాద్ ను విశ్వనగరంగా మార్చేందుకు ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యాలు. శిల్పారామంలో జరిగిన బ్రాండ్ హైదరాబాద్ కార్యక్రమంలో  సర్కారు లక్ష్యాలను ఆవిష్కరించారు ఐటీ మంత్రి  కేటీఆర్.

భాగ్యనగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దే బాధ్యత తమదేన్నారు రాష్ట్ర ఐటీ, పంచాయతీ రాజ్ మినిస్టర్ కె.తారకరామారావు. శిల్పారామంలో ఏర్పాటు చేసిన బ్రాండ్ హైదరాబాద్ కార్యక్రమానికి అటెండయ్యారు కేటీఆర్. ప్రభుత్వ విధానాలపై పవర్ పాయింట్ ప్రెజేంటేషన్ ఇచ్చారు. సిటీలో విశాలమైన రోడ్లు, మెరుగైన ట్రాన్స్ పోర్టు ఫెసిలిటీ, నిరంతర విద్యుత్, మహిళల భద్రత, విద్య, వైద్యం పరిశ్రమలకు ప్రొత్సహం కల్పిస్తున్నామన్నారు మినిస్టర్. రాజధానిలో ఆడిటోరియంల నిర్మాణం, లైబ్రరీలు, ప్లే గ్రౌండ్స్ ఆధునీకరిస్తామన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు కేటీఆర్. సాప్ట్ వేర్ ఉద్యోగులు, ప్రజలు అడిగి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. నగరంలోని అన్ని ప్రాంతాలను కలిపేలా రెండోదశలో మెట్రోరైల్, MMTS రైలు మార్గాలను విస్తరిస్తామన్నారు. సిటీ డెవలప్ మెంట్ కోసం ప్రభుత్వం రూపొందించిన ప్రణాళికలను మంత్రి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో వివరించారు.

టీ హబ్ లో ఐటీ స్టార్టప్స్ మాదిరిగానే యానిమేషన్, మల్టీమీడియా రంగాల్లో స్టార్టప్స్ ను ప్రోత్సహించేందుకు ఇంక్యుబేటర్లు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు మంత్రి. ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటుకు కూడా ప్రయత్నం చేస్తున్నామన్నారు. వచ్చే మూడేళ్లలో లక్ష మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పిస్తామన్నారు. అటు రాష్ట్రంలో ప్రతి ఇంటికీ మంచినీటిని అందిస్తామన్నారు కేటీఆర్. గ్రేటర్ లో తాగునీటి కష్టాలను ప్రస్తావించారు కేటీఆర్. సిటీలో మరో రెండు రిజర్వాయర్లు ఏర్పాటు చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తామన్నారు. ఆసరా పింఛన్లు, డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇలా అన్నింటిపై మాట్లాడారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy