ఒలిఫెంట్‌ రైల్వే బ్రిడ్జి వద్ద రాకపోకలు బంద్

elephant bridgeమెట్రో పనులు జరుగుతున్నందున 15 రోజుల పాటు రాకపోకలు నిలిపివేత

ఒలిఫెంట్‌ రైల్వే బ్రిడ్జి వద్ద మెట్రో పనుల చేపడుతున్నందున వాహనాల రాకపోకలను సోమవారం( ఆగస్టు 7) తెల్లవారు జాము నుంచి 15రోజుల పాటు నిలిపివేయనున్నారు. ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యమ్నాయ మార్గాలను ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు నగర పోలీసు కమిషనర్‌ మహేందర్‌రెడ్డి. ఆయన ఆదేశాలతో ఇక్కడ జరుగుతున్న పనుల కారణంగా మెట్రో, ఎల్‌అండ్‌ టీ అధికారులు పంజగుట్ట ట్రాఫిక్‌ డీసీపీ చౌహన్‌ ఉత్తరమండలం ట్రాఫిక్‌ ఏసీపీ ముత్యంరెడ్డి, ఇన్‌స్పెక్టర్లు రామస్వామి, మదర్‌లు గత 4 రోజుల క్రితం నగర ట్రాఫిక్‌ అదనపు డీజీపీ రవీందర్‌తో సమావేశం అయ్యారు. సికింద్రాబాద్‌ నుంచి ముషీరాబాద్‌ వైపు, చిలకలగూడ, ఉప్పల్‌ ఇతర ప్రాంతాల్లోకు రాకపోకలు సాగించేందుకు ప్రధాన రహదారిగా ఉన్న ఒలిఫెంట్‌ రైల్వే బ్రిడ్జి దారిలో నిత్యం రద్దీగా ఉంటుంది. మెట్రో పనులను చేపడుతున్న సమయంలో అక్కడ నుంచి వాహనాలు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నట్లుగా గుర్తించారు అధికారులు. ఇబ్బందులను నివారించేందుకు అందుకు అవసరమైన చర్యలు చేపట్టారు.

పాదచారులకు అవకాశం.. 
ఒలిఫెంట్‌ రైల్వే బ్రిడ్జి వద్ద ఇరువైపుల పాదచారులకు రాకపోకలు సాగించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. అదే విధంగా సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ స్టేషన్‌ రోడ్డు ప్రాంతాల నుంచి చిలకలగూడ చౌరస్తా వద్ద నిలిపేసి ముషీరాబాద్‌, కోఠివైపు ఆర్టీసీ బస్సులు ఎక్కేందుకు, అలాగే ఉప్పల్‌, ఎల్‌బీనగర్‌, హయత్‌నగర్‌, వనస్థలిపురం వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులను ఎక్కేందుకు నడుచుకుంటూ వెళ్లే అవకాశం ఉంది.

15రోజుల పాటు ఒలిఫెంట్‌ రైల్వే బ్రిడ్జి మూసివేత

మెట్రోరైలు పనుల్లో భాగంగా నేటి నుంచి 15రోజుల పాటు ఒలిఫెంట్‌ రైల్వే బ్రిడ్జిని మూసివేస్తున్నారు. ప్రయాణికులు సులభంగా గుర్తించే విధంగా ఏఏ ప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ బస్సులు ఏక్కడ నిలుపుతారనే వివరాలను గుర్తించే విధంగా సూచక బోర్డులను ఏర్పాటు చేశారు. ఆర్టీసీ ట్రాఫిక్‌ అధికారులు, సిబ్బంది కూడా ఆ ప్రాంతాల్లో ఉండి ప్రయాణికులకు అవగాహన కల్పిస్తారు.

.. సికింద్రాబాద్‌ నుంచి ముషీరాబాద్‌, చిలకలగూడ, సీతాఫల్‌మండీ వైపు వెళ్లే వాహన దారులు సంగీత్‌ చౌరస్తా, రైలు నిలయం మీదుగా వెళ్లవచ్చు. 
.. సికింద్రాబాద్‌ నుంచి కోఠి, ముషీరాబాద్‌ వైపు నగరంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ బస్సులు చిలకలగూడ చౌరస్తా నుంచి బయలుదెరుతాయి. అక్కడికి వచ్చిన బస్సులు తిరిగి అక్కడ నుంచి వెళ్తాయి.
.. ఉప్పల్‌ వైపు నుంచి చిలకలగూడ చౌరస్తా వద్దకు వచ్చే వాహనాలు గతంలో లాగానే అక్కడ నుంచి తిరిగి వెళ్తాయి. 
.. ఉప్పల్‌, మల్కాజ్‌గిరి, ఇసీఐఎస్‌ ప్రాంతాల నుంచి సికింద్రాబాద్‌ బ్లూసీ హోటల్‌ బస్టాండ్‌ వద్ద ప్రయాణికులను తీసుకుని వచ్చి ఉప్పల్‌ బస్టాండ్‌లో నిలిపే ఆర్టీసీ బస్సులను తిరిగి రేతిఫైల్‌ బస్టాండ్‌ వద్ద ఉన్న డిలైట్‌ చౌరస్తా నుంచి మలుపు తీసుకుని సంగీత్‌ చౌరస్తా మీదుగా వెళ్లే విధంగా చర్యలు తీసుకున్నారు. 
.. చిలకలగూడ, ముషీరాబాద్‌, సీతాఫల్‌ మండీ వైపు నుంచి సికింద్రాబాద్‌కు, సికింద్రాబాద్‌ మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్లే వాహనదారులు ఆలుగడ్డ బావి చౌరస్తా రైలు నిలయం మీదుగా సంగీత్‌ చౌరస్తా నుంచి వెళ్లాలి. 
.. బేగంపేట్‌, బాలానగర్‌, బోయిన్‌పల్లి వైపు నుంచి సికింద్రాబాద్‌ మీదుగా ముషీరాబాద్‌, సీతాఫల్‌మండీ ప్రాంతాల వైపు వెళ్లే వాహనాలు సంగీత్‌, ఆలుగడ్డ బావి చౌరస్తా, చిలకలగూడ చౌరస్తా మీదుగా వెళ్లాలి. 
.. ప్రతి బస్టాండ్‌కు ప్రయాణికులు ఏవిధంగా వెళ్లాలి… ఎక్కడ ఆర్టీసీ బస్సులను నిలుపుతారు అనే దాన్ని గుర్తించేందుకు వీలుగా సూచకబోర్డులు ఏర్పాట్లు ఉంటాయి.

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy