ఓజోన్ డే: రక్షణ కవచాన్ని కాపాడుకుందాం

Earth-and-Moonప్రకృతి.. ఈ మాట వినగానే మనిషికి ఓ ఆహ్లాదం, ఓ అనుభూతి కలుగుతాయి. అలాంటి అనుబంధం ప్రకృతికి మనిషికి ఉంది. ఈ అనుబంధాన్ని కాపాడేది ఓజోన్. సూర్యుడి వల్ల కలిగే చెడు ప్రభావాల నుంచి ఇది మనిషిని కాపాడుతుంది. అలాంటి ఓజోన్ నే నాశనం చేసే స్థితికి చేరాడు మనిషి. ఈ పరిస్థితి నుంచి మనిషి తనను తాను కాపాడుకోవాలని గుర్తుచేసే రోజే… వరల్డ్ ఓజోన్ డే. ఈ సందర్భంగా వీ6 స్పెషల్ స్టోరీ.

భూమిపై మనిషి మనుగడకు ఎలాంటి అడ్డు లేకుండా కాపాడేది ఓజోన్. సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు నేరుగా భూమిని తాకకుండా కాపాడే రక్షణ కవచం ఓజోన్ లేయర్. భూమికే రక్షణ కవచం అయిన ఓజోన్ ను ఇప్పుడు మనిషే నాశనం చేస్తున్నాడు. తనకు తానే మరణశాసనం రాసుకుంటున్నాడు. మరి భవిష్యత్ ఏంటి? అంధకారమేనా? ఈ ప్రశ్నకు సమాధానమే… వరల్డ్ ఓజోన్ డే. మన బాధ్యతను మనకు గుర్తుచేసే రోజు.

అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినం. ఏటా సెప్టెంబర్ 16న జరుపుకుంటున్నాం. ఓజోన్ ను నాశనం చేస్తున్న రసాయనాల నియంత్రణ కోసం… మాంట్రియల్ ఒప్పందంపై ప్రపంచ దేశాలు సంతకాలు చేసింది ఈ రోజే. భూమిపై కాలుష్యం వల్ల దెబ్బతింటున్న ఓజోన్ ను రక్షించేందుకు ఈ ఒప్పందాన్ని రూపొందించారు.

1987లో 24 దేశాల ప్రతినిధులు మాంట్రియల్ లో సమావేశమయ్యారు. కాలుష్యం వల్ల దెబ్బతింటున్న ఓజోన్ ను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్ని దేశాలు అంగీకరించాయి. అందుకు తీసుకోవాల్సిన చర్యలతో రూపొందిందే… మాంట్రియల్ ప్రోటోకాల్. ఇది 1995 తర్వాత పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చింది.

ఓజోన్ పోర భూమికి ఒక రక్షణ కవచం. భూమిని ఆవరించి వున్నా ఐదు పోరల్లో ఓజోన్ ఒకటి. ఇది భూమి నుంచి 20కిలోమిటర్ల నుంచి 50కిలోమిటర్ల ఎత్తులో ఆవరించి వుంటుంది. పలుచగా వల లా వుండే ఈ లేయర్ 3mm నుంచి 5mm మందం కలిగి ఉంటుంది. ఈ పోర కాలుష్యం నుండి వెలువడే రసాయనాల నుండి దెబ్బతింటుంది. అందుకే వియన్నా కన్వెన్షన్, మాంట్రియల్ ప్రోటోకాల్ లో భాగమై భారతదేశం కూడా ఓజోన్ పరిరక్షణకు  ప్రపంచ దేశాలతో కలసి పోరాడుతుంది.

విశ్వం ఏర్పరిచిన ఓజోన్ పొరకు మనమే స్వయంగా తూట్లు పొడుస్తున్నాం. ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నాం. ఆమ్ల వర్షాలు, అతి, అల్ప వర్షపాతం, సునామీలు, అధిక ఉష్ణోగ్రత లాంటి అన్ని రకాల ఇబ్బందులను మనమే అహ్వానిస్తున్నాం. ఇప్పటికైనా చైతన్యం పొందితే ముప్పును నివారించిన వాళ్లమై మన భావి తరాలను కాపాడుకునే వాళ్లం అవుతాం. అందుకే ‘‘యూఎస్ఈపీ’’ ప్రపంచ దేశాలను పిలుస్తుంది. విశ్వవ్యాప్తంగా ఓజోన్ పరిరక్షణ రోజు ను పాటించమని కోరుతుంది. అందుకే తనవంతు బాధ్యతగా అంతర్జాతీయ ఓజోన్ డే సందర్భంగా వీ6 స్పెషల్.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy