ఓటుకు నోటు కేసులో బాబే బాస్..!

babu

స్టీఫెన్ సన్ తో ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్ సంభాషణ ఆడియో ఔట్

ఓటుకు నోటు కేసులో బాసు ఏపీ సీఎం చంద్రబాబేనని తెలిసిపోయింది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ తో బాబు మాట్లాడిన ఆడియో టేపులు బయటకొచ్చాయి. రేవంత్ రెడ్డి రెండో రోజు విచారణ తర్వాత ఈ ఆడియో టేప్స్ లీకయ్యాయి. మనీ అగ్రిమెంట్ కు సంబంధించి  స్టీఫెన్ సన్ తో  బాబు  ఫోన్లో మాట్లాడినట్లు టేపుల్లో స్పష్టంగా తెలుస్తోంది. రేవంత్ రెడ్డి చెప్పిన దానికి తానే భరోసా అని  బాబు హామీ ఇచ్చినట్లు వాయిస్ ను బట్టి అర్థమవుతోంది. దీంతో ఏ క్షణంలోనైనా  విచారణకు హాజరు కావాలని  చంద్రబాబుకు ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేసుకు అవసరమైన కాల్ డేటా పైనా ఏసీబీ అధికారులు నజర్ పెట్టినట్లు సమాచారం. నోటుకు ఓటుకు ఇష్యూలో బాబుతోపాటు మరో ఇద్దరు నేతలు బుక్కయ్యే పరిస్థితి కనిపిస్తోంది. స్టీఫెన్ కు రేవంత్ రెడ్డి ఇచ్చిన 50 లక్షలు ఎవరు అరెంజ్ చేశారన్నది ఏసీబీ అధికారులు ఇవాళ బయటపెట్టనున్నట్లు సమాచారం. టేపుల కలకలం కంటిన్యూ అవుతుండగానే సీఎం కేసీఆర్ గవర్నర్ తో సమావేశమయ్యారు. అప్పటి వరకు రాష్ట్ర అవిర్భావ ముగింపు సంబురాల్లో కేసీఆర్, నరసింహన్ పాల్గొన్నారు. ఆడియో టేపులు బయటపడిన వెంటనే గవర్నర్ తో సీఎం భేటీ అయ్యారు. సేమ్ టైమ్ ఏపీ సీఎం చంద్రాబాబు ఆ రాష్ట్ర హోంమంత్రి, పోలీసు ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఫ్యూచర్ పై డిస్కషన్ చేసినట్టు తెలుస్తోంది.

ఎమ్మెల్సీ ఎన్నికల ముందు టీడీపీ శాసనసభా పక్ష ఉప నేత రేవంత్ రెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.  ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి మద్దతుగా ఓటేయాలని నామినేటెడ్ ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ ను రేవంత్ రెడ్డి కాంటాక్ట్ అయ్యారు. యాభై లక్షలు స్టీఫెన్ సన్ కు ఇస్తుండగా రేవంత్ రెడ్డిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు అధికారులు. 5 కోట్ల డీల్ తో రేవంత్ రెడ్డి యవ్వారం నడిపించినట్టు ఏసీబీ అధికారులు తేల్చారు. వోట్ ఫర్ నోట్ కేసులో డైరెక్షన్ బాబైతే యాక్షన్ రేవంత్ చేశారని విపక్షాలు మొదటి నుంచి ఆరోపిస్తున్నాయి. బాబును ఏ1గా చేర్చాలని డిమాండ్ చేస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి బాబు డీల్ సెట్ చేశారని ఆరోపించాయి. అయితే ఏ1గా రేవంత్ నే ఏసీబీ అధికారులు బుక్ చేశారు. రేవంత్ రెండు రోజుల విచారణ తర్వాత బాబు ఆడియో టేపులు బయటపడటం రాజకీయంగా దుమారం రేపుతోంది.

వారి సంభాషణను ఇక్కడ వినొచ్చు..

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy