ఓటు వేయకపోతే శిక్షే…చట్టం తెచ్చిన గుజరాత్

voting-fingerస్థానిక ఎన్నికల్లో ఓటు వేయడం తప్పనిసరిని చేస్తూ చట్టం తెచ్చింది గుజరాత్ ప్రభుత్వం. ఈ చట్ట ప్రకారం గ్రామ పంచాయితీ, మున్సిపల్, జిల్లా ఎలక్షన్స్ లో ఎవరైనా ఓటు వేయకపోతే తగిన శిక్ష వేస్తారు. అయితే కొన్ని కారణాల వల్ల ఓటు వేయకపోతే ఎలాంటి శిక్ష ఉండదు. దానికి సంబంధించిన కారణాలను కూడా బిల్లులో పొందుపరిచారు. ఎలాంటి శిక్ష వేస్తారో మాత్రం చట్టంలో పొందుపరచలేదు. దీంతో దేశంలో ఓటింగ్ ను తప్పనిసరి చేసిన ఫస్ట్ స్టేట్ గా గుజరాత్ నిలిచింది. 2009 లో మోడీ సీఎంగా ఉన్నప్పుడు చేసిన ఈ చట్టాన్ని ఆ రాష్ట్ర గవర్నర్ ఆమోదించారు. లోకల్ ఎలక్షన్స్ లో మహిళలకు 50% రిజర్వేషన్లు కూడా ఈ చట్టంలో కేటాయించారు. 2010 లో ఈ చట్టాన్ని అప్పటి గవర్నర్ కమల రిజెక్ట్ చేశారు. అయితే మోడీ పీఎం అయిన తర్వాత కమలను గవర్నర్ గా తొలగించి, ఓపీ కోహ్లీను గుజరాత్ గవర్నర్ గా నియమించారు. కోహ్లి ఈ బిల్లును ఆమోదించడంతో చట్టంగా మారింది. బిల్లులో లేని కారణాల వల్ల ఓటు వేయకపోతే ఆ ఓటర్ ను డీఫాల్టార్ గా ప్రకటించి తగిన శిక్ష వేస్తారు. అయితే ‘ఓటింగ్ తప్పనిసరి’  అంశాన్ని కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించింది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy