ఓటేసిన సౌదీ మహిళలు

soudi womenఅంతా రాచరిక పాలన… మహిళలపై లెక్కలేనన్నిఆంక్షలు.. బయట తిరగకూడదు… మాట్లాడకూడదు. ఒకవేళ తిరగాల్సి వస్తే.. అరికాలి నుంచి నడినెత్తి వరకు కప్పేసుకుని తిరగాలి. చివరకు వాహనం నడిపే హక్కు కూడా లేదు. ఇది సౌదీ అరేబియాలో మహిళల పరిస్థితి. కానీ… ఇప్పుడు సిచ్యువేషన్ మారిపోయింది. కట్టుబాట్లను దాటుకుని చట్టాలు చేసే దిశగా అడుగులువేస్తున్నారు అక్కడి మహిళలు. దీనికి ఇప్పుడే తొలి అడుగు పడింది.

ఇస్లాం దేశమైన సౌదీ అరేబియాలో ఓ చారిత్రాత్మక సంఘటన జరిగింది. మహిళలపై కుప్పలు తెప్పలుగా ఆంక్షలుండే సౌదీలో.. పాలకులు మనసుమార్చుకున్నారు. మహిళలకు హక్కులు కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. మొదటి సారిగా మహిళలకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశంతో పాటు, ఓటుహక్కు కల్పించారు. రాజరిక పాలనలో ఉన్న సౌదీ అరేబియాలో ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి ఎన్నికలు ఉండవు. కేవలం మున్సిపాలిటీలకు మాత్రమే ఎన్నికలు నిర్వహిస్తారు. పాలనమొత్తం రాజులే చూసుకుంటారు.

మహిళలపై వివక్షను నియంత్రించేందుకు గత రాజు అబ్దుల్లా ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు.. తన అడ్వైజరీ కౌన్సిల్ లోని కీలక స్థానాల్లో 30 మంది మహిళలకు స్థానం కల్పించారు. రాజు నిర్ణయంతో మొదటిసారిగా ఎన్నికల్లో 900 మంది లేడీస్ పోటీచేశారు. ఈ ఎలక్షన్స్ లో దాదాపు 6 వేలమంది పురుషులు పోటీకి దిగారు. 284 మున్సిపల్ కౌన్సిల్స్ లోని 3,159 సీట్లకు ఎన్నికలు జరిగాయి. ఓటుహక్కు తో పాటు.. పోటీ చేసేఅవకాశం, కల్పించడంపై సౌదీలోని మహిళా ఉద్యమకారులు ఫుల్ ఖుషీగా ఉన్నారు.

ఎన్నికల్లో లక్షా 30 వేలమంది మహిళలు ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. అయితే.. ఎలక్షన్స్ టైమ్ లోనూ మహిళలకు ఇబ్బందులు తప్పలేదు. పురుష ఓటర్లను నేరుగా కలవకూడదనే కండీషన్ పెట్టారు అక్కడి పాలకులు. దీంతో మహిళా అభ్యర్థులు సోషల్ మీడియాలోనే ప్రచారంచేశారు. మరోవైపు ఇప్పటి ఓటువేయడం తెలియకపోవడం కూడా ఇబ్బందిగా మారింది. ఓటింగ్ ప్రక్రియపై అధికారులు తమకు అవగాహన కల్పించలేదంటున్నారు సౌదీ అరేబియా మహిళలు. దీంతో రిజిస్టర్ చేసుకున్న వారిలో కేవలం పదిశాతం మాత్రమే ఓటుహక్కు వినియోగించుకున్నారు. సమస్యల సంగతి పక్కనపెడితే.. సౌదీ పాలకులు తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయంతో మహిళలు ఫుల్ హ్యాపీగా ఫీలవుతున్నారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy