ఓట్ ఫర్ నోట్ కేసుపై హైకోర్టులో నారాయణ పిటిషన్

cpi-narayana-say-s-geetha-reddy-must-resign(1)ఓట్ ఫర్ నోట్ కేసు, పార్టీ ఫిరాయింపులపై హైకోర్టులో పిటిషన్ వేశారు సీపీఐ సీనియర్ నేత నారాయణ. కోర్టు పర్యవేక్షణలో ఈ కేసు దర్యాప్తు జరిగేలా ఉత్తర్వులు ఇవ్వాలని పిటీషన్ లో కోరారు. కేంద్ర ఎన్నికల కమిషన్, టీఆర్ఎస్, టీడీపీ, ఏపీ, తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శులను ఈ కేసులో ప్రతివాదులుగా చేర్చారు. ఈ కేసులో తనకు ఎలాంటి ప్రత్యామ్నాయం కనిపించక ఆర్టికల్ 226 ఆధారంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు తెలిపారు నారాయణ. ప్రజాప్రాతినిధ్య చట్టం అమలు, భారత రాజ్యాంగ విలువల కోసం న్యాయ స్థానం జోక్యం చేసుకోవాలని కోరారు.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy