ఓరి దేవుడా : మార్కెట్ లోకి ప్లాస్టిక్ కోడిగుడ్లు

eggsకోల్ కతాలో ఘరానా మోసం బయటపడింది. ప్లాస్టిక్ కోడిగుడ్లను యథేచ్చగా అమ్మేస్తున్నారు వ్యాపారులు. కరేయా పోలీస్ స్టేషన్ సమీపంలో ఉండే మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో అలర్ట్ అయిన పోలీసులు.. వ్యాపారిని అదుపులోకి తీసుకున్నారు. దుకాణంలో పెద్ద ఎత్తున నిల్వ చేసిన ప్లాస్టిక్ కోడిగుడ్లను స్వాధీనం చేసుకున్నారు.

బంధువుల ఇళ్లలో కోడిగుడ్లు ఉడకబెడుతుండగా.. ఇబ్బందికరంగా వాసన వచ్చాయి.  అనుమానమొచ్చిన మహిళ.. వాటిని పరిశీలనగా చూసింది. అవి ప్లాస్టిక్ గుడ్లగా నిర్దారించుకున్న తర్వాత.. కన్ స్యూమర్ కోర్టులో ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత తిల్జాలా ఏరియాలో సోదాలు నిర్వహించి.. వ్యాపారిని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై కోల్ కతా మేయర్ విచారణకు ఆదేశిస్తామన్నారు. తను ఎప్పుడూ వినడమే కానీ చూడలేదని.. సిటీలో తొలిసారి చూశాను అన్నారు కోల్ కతా మేయర్.

గతంలో కేరళలోనూ ఇలాంటి గుడ్లనే అమ్ముతున్నారన్న ప్రచారం జరిగింది. చైనా నుంచి దిగుమతి అవుతున్నట్టు అప్పట్లో వార్తలు పుట్టుకొచ్చాయి. దీంతో కోడి గుడ్డులో తేడా ఉంటే స్థానిక అధికారులకు సమాచారం ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది కేరళ ప్రభుత్వం. అసలు చైనా కృత్రిమ కోడిగుడ్లు ఉన్నాయా.. లేదా అని తేల్చేపనిలో పడింది కేరళ ఫుడ్ డిపార్ట్ మెంట్.

చైనా గుడ్డు ఎలా గుర్తించాలి :

… చైనా గుడ్డు గోధుమ రంగులో ఉంటుంది. మామూలు గుడ్డుకు వచ్చే వాసన చైనా వాటికి రాదు

… గుడ్డు పగలగొట్టిన తర్వాత ఈగలు, దోమలు వాలవు. ఎన్ని నెలలు అయినా గుడ్డు చెడిపోదు.

… చైనా గుడ్డు పెద్ద సైజులో ఉంటుంది. సాధారణ గుడ్డు కంటే మెరుపు ఎక్కువ

… పెంకు కూడా రఫ్ గా ఉంటుంది. చైనా గుడ్డును ఊపగానే సౌండ్ చేస్తుంది. సహజమైన గుడ్డు ఎలాంటి శబ్దాలు చేయదు.

… చైనా గుడ్డును పగలకొట్టగానే తెల్లసొన.. పచ్చ సొన కలిసిపోతాయి.

… చైనా గుడ్డు వేపుడు చేసేటప్పుడు పచ్చసొన దానికదే ప్యాన్ లో పాకిపోతుంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy