ఓరుగల్లు చారిత్రక వైభవం ఐనవోలు మల్లన్న జాతర  

జానపదుల జాతరగా పేరొందిన ఐనవోలు మల్లన్న ఉత్సవాలకు అంతా రెడీ అయింది. వనదేవతల జాతర మేడారం తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండో అతిపెద్ద జాతర ఇది. ఇప్పుడు వరంగల్ అర్బన్ జిల్లాలో mallanaఅతిపెద్ద జనజాతరగా గుర్తింపుపొందింది.

ఐనవోలు ఆలయాన్ని కాకతీయుల కాలంలో నిర్మించారు. కాకతీయుల మంత్రి అయ్యన్నదేవుడు ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతారు. అయ్యన్నదేవుడు నిర్మించడం వల్ల ఈ గ్రామానికి ఐనవోలు అన్న పేరొచ్చింది.  ఒక చేతిలో ఖడ్గం, మరో చేతి లో త్రిశూలం, ఢమరుకం, తలపై కిరీటం, కోర మీసాలు, ఒంటి నిండా కళ్లు చెదిరేలా ఆభరణాలతో  ప్రకాశించే మల్లన్న ప్రతిమను దర్శించుకునేందుకే రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు తరలివస్తారు. కుడివైపున గొల్ల కేతమ్మ, ఎడమ వైపు న బలిజె మేడలమ్మతో భక్తులకు దర్శనిమిస్తారు మల్లన్న.

ఐనవోలు మల్లన్న జాతర లో శివసత్తుల పూనకాలు, ఒగ్గు పూజారుల ఆటపాట, డోలు వాయిద్యాలు ఆకట్టుకుంటాయి. గజ్జెల లాగులు, నెత్తిన బోనం, చేతిలో చర్నాకొలా పట్టుకొని భక్తులంతా ఆలయం చుట్టు ప్రదక్షిణలు చేస్తారు. పురుషులు సైతం మహిళలుగా వేషదారణ వేసుకొని స్వామి వారికి, అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తారు.

సంక్రాంతి నుంచి ఉగాది వరకు మూడు నెలల పాటు ఈ జానపద జాతర జరగనుంది. స్వామి వారిని దర్శించుకోవడానికి భారీగా భక్తులు తరలివస్తారు. రాష్ట్రం నుంచే కాక పక్క స్టేట్ ల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. అయితే పెరుగుతున్న భక్తుల రద్దీకి తగ్గట్టుగా వసతులు పెంచాలని కోరుతున్నారు.

One Response to ఓరుగల్లు చారిత్రక వైభవం ఐనవోలు మల్లన్న జాతర  

  1. Hi friends.
    Telangana is very good place but most of places are not developed well .Orugallu is very old popular identity for entire Telangana.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy