ఓరుగల్లు వాసులను వణికిస్తున్న కుక్కలు

dog1బల్దియా అధికారుల నిర్లక్ష్యం వరంగల్ ప్రజలను కుక్కలకు బలిచేస్తోంది. వరంగల్, హన్మకొండ, కాజీపేటలో నిత్యం వందలాది మంది కుక్కకాటు బారిన పడుతున్నారు. చేతిలో కర్ర లేకుండా బయట అడుగుపెట్టాలంటే భయపడుతున్నారు జనం. కుక్కలు కరిచి పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా కుక్క కాటుతో అఫ్సాన్ అనే బాలుడు చనిపోయాడు.

లోకాయుక్త ఆదేశాలతో కుక్కల బెడద తొలగించేందుకు రంగంలోకి దిగిన బల్దియా వరంగల్ , హన్మకొండ ప్రాంతాల్లో రెండు బృందాలను ఏర్పాటు చేసింది. దీంతో కుక్కల కోసం ప్రత్యేక వల, బోనులు ఏర్పాటు చేసి వీధి కుక్కలను పట్టుకున్నారు. కానీ పర్యవేక్షణ లేకపోవడంతో కొద్ది రోజులకే కుక్కల సంగతి మర్చిపోయారు అధికారులు. కుక్కల భయంతో వీధుల్లో తిరగలేకపోతున్నామంటున్నారు నగర వాసులు. కోతులు కూడా ఇళ్లల్లోకి వచ్చి సామానులు ఎత్తుకుపోతున్నాయని వాపోతున్నారు.

పిల్లలు, మహిళలు, వృద్ధులపైనే కుక్కలు ఎక్కువగా దాడులు చేస్తున్నాయి. నగరంలో రోజూ ఏదో ఒకచోట కుక్క కరిచిన ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. కుక్కల బెడదపై కార్పోరేషన్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు.

dog2ఒక్క ఎంజిఎం ఆస్పత్రికే రోజూ దాదాపు వంద మంది కుక్కకాటు బాధితులు చికిత్స కోసం వస్తున్నారు. కుక్క కరిచినప్పుడు రాబిస్ లాంటి  వైరస్ రాకుండా 3 నుంచి 5 వాక్సిన్ లు తీసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు రోజు రోజుకు కుక్క కాటు బాధితుల సంఖ్య పెరుగుతోందంటున్నారు వైద్యాధికారులు. ఇప్పటికైనా నగరపాలక సంస్థ అధికారులు కుక్కలు, కోతుల బెడద తొలగించాలని కోరుతున్నారు ఓరుగల్లు వాసులు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy