ఓర్వలేకనే కాంగ్రెస్ నేతల ఆరోపణలు

mp-kavithaకాంగ్రెస్ నిర్వహిస్తున్న జన ఆవేదన సభలు.. కాంగ్రెస్ ఆవేదన సభల్లా ఉన్నాయని విమర్శించారు.. నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత. నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన కవిత.. నవీపేట్ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక … కాంగ్రెస్ నేతలు ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. రెండేళ్లలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి కాంగ్రెస్ నేతలకు కనబడటం లేదా అని ప్రశించారు. విపక్ష నేతల అసత్య ప్రచారాలకు స్పందించాల్సిన అవసరం లేదన్నారు. దిగ్విజయ్‌సింగ్‌కు తెలంగాణ రాష్ట్రంపై అవగాహన లేదన్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy