ఓలా ఆఫర్‌ : క్యాబ్ లో తిరిగేయ్‍.. తర్వాత పే చెయ్‌

హైదరాబాద్, వెలుగు: క్యాబ్ సేవల సంస్థ ఓలా తమ వినియోగదారులకు ఓ తీపి కబురు అందించింది. ఓలా మనీ పోస్ట్ పెయిడ్ పేరిట కొత్త సేవలను అందుబాటులోకి తీసుకు వచ్చింది. దీంతో క్యాబ్ సేవలు ఉపయోగించుకున్న తరువాత 15 రోజుల్లోపు ఎప్పుడైనా మీరు చెల్లింపులు చేయవచ్చు. విడిగా కాకుండా ఒకేసారి 15 రోజులకు కలిపి చెల్లింపులు చేయవచ్చు. ప్రస్తుతం కొంత మంది కస్టమర్లకే ఈ అవకాశాన్ని అందిస్తున్నప్పటికీ త్వరలోనే అందరికీ అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఓలా తెలిపింది.

గతేడాది పైలట్ ప్రాజెక్టు కింద ఈ ఆఫర్ ప్రారంభించగా నెల నెలా కస్టమర్లు 30 శాతం వృధ్ది చెందారని, అందుకే పూర్తి స్థాయిలో త్వరలోనే 15 కోట్లకు పైగా కస్టమర్లకు ఈ సేవలను అందించాలనే లక్ష్యంతో ఉన్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఇన్విటేషన్ ద్వారా ఎంపిక చేసిన కస్టమర్లకే ఈ సేవలను అందిస్తోంది. క్యాబ్ సర్వీసులు వినియోగించుకున్న తర్వాత 15 రోజుల్లోపు ఎలాంటి పాస్ వర్డ్, ఓటిపి అవసరం లేకుండా డిజిటల్ పేమెంట్ ద్వారా చెల్లింపులు జరపవచ్చు.

ప్రస్తుతం 10 శాతానికి పైగా ఓలా కస్టమర్లు ఓలా మనీ పోస్ట్ పెయిడ్ సర్వీసులను తరుచూ వాడుతున్నారని ఓలా ఫైనాన్షియల్ సర్వీసెస్ సీఈవో నితిన్ గుప్తా తెలిపారు. త్వరలోనే అందరికీ అందుబాటులోకి తీసుకురావడంతో పాటు బిల్లు చెల్లిం పులకు గడువును నెల రోజులకు పెంచుతా మని అన్నారు. దీంతో పాటు ఫుడ్, ఎంటర్టైన్మెంట్, యుటిలిటీస్ వంటి విభాగాల్లోనూ ఇలాంటి వెసులుబాటు కల్పిస్తామని తెలిపారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy