ఓల్డెస్ట్ స్టార్ ను కనుగొన్న ఆస్ట్రేలియన్లు

anu1

ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్శిటికి చెందిన ఖగోళ శాస్త్రవేత్తలు సృష్టిలోనే అతి పురాతనమైనదిగా లెక్కించ దగ్గ  నక్షత్రాన్ని కనిపెట్టారు. దాదాపుగా 13.7 బిలియన్ సంవత్సరాల వయసుంటుందని అంచనా వేస్తున్న ఈ నక్షత్రాన్ని ఈ మధ్యే కనుగొన్నామని వీరు ప్రకటించారు. ఇలాంటి నక్షత్రాలను ఎప్పుడు చూడలేదని, స్టార్ యొక్క కెమికల్ ఫింగర్ ప్రింట్ ను కనిపెట్టామన్నారు సైంటిస్టులు. పురాతన నక్షత్రాలు ఎలా ఉండేవో దీన్ని చూస్తే చాలంటున్నారు శాస్త్రవేత్తలు. ఓల్డెస్ట్ స్టార్ ని కనిపెట్టిన ఈ సైంటిస్ట్లు  పురాతన నక్షత్రాలపై ఐదు సంవత్సరాలుగా ప్రయోగాలు చేస్తుండగా మొట్ట మొదటి సారి ఈ నక్షత్రం బయటపడింది.

ఖగోళ పరిశోధనలలో కొత్త మార్పులు తేదగ్గదిగా ఈ ప్రయోగం నిలవవచ్చని ఈ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy