ఓ కానిస్టేబుల్ దుస్సాహసం

conistableఓ కానిస్టేబుల్ సంచలనం సృష్టించాడు. కేంద్ర మాజీ మంత్రి, లోక్ సభ ఎంపీ కమల్ నాథ్ తుపాకీ గురిపెట్టాడు. అప్పటికే ఎంపీ బాడీ గార్డ్స్ అప్రమత్తమవ్వడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే ఈ విషయలేవీ కమల్ నాథ్ కు తెలియదు. వివరాల్లోకి వెళితే.. కమల్‌నాథ్‌ ఢిల్లీకి చార్టెడ్‌ విమానంలో బయలుదేరేందుకు ఛిన్‌ద్వారాలోని విమానాశ్రయానికి శుక్రవారం వచ్చారు. ఈ సమయంలో రత్నేష్‌ పవార్‌ అనే కానిస్టేబుల్‌ అనుమానాస్పదంగా వ్యవహరించాడు. కమల్‌నాథ్‌ విమానం ఎక్కుతుండగా.. పవార్‌ తన సర్వీస్‌ రైఫిల్‌ను ఆయన వైపు గురిపెట్టి.. అనుమానాలు రేకెత్తించాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన అంగరక్షకులు కానిస్టేబుల్‌ను అడ్డుకొని.. పక్కకు తోసేశారు. ఈ ఘటన నేపథ్యంలో పవార్‌ను సస్పెండ్‌చేసి విచారణకు ఆదేశించామని ఏఎస్పీ నీరజ్‌ సోనీ వెల్లడించారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy