ఓ చిన్నారి కోసం 78 ఏళ్ల బామ్మ తపన

17457855_10155252094324759_5764097093282764330_nమాయలోడు సినిమాలో హీరో రాజేంద్ర ప్రసాద్.. ఓ చిన్నారి కోసం నానా కష్టాలు పడతాడు. ఆప్యాయత… అనుబంధం.. మనిషిని ఎంత దూరమైనా తీసుకు వెళతాయి. దానికి రక్త సంబంధంతో పనిలేదు. సరిగ్గా ఇలాంటిదే చైనాలో జరుగుతోంది.  ఇలాంటి అప్యాయత.. అనురాగాలే.. ఓ బామ్మను అందరి ప్రశంసలు అందుకునేలా చేస్తున్నాయి. ఎనిమిదేళ్ల పాప కోసం 78 ఏళ్ల వయస్సులోను విసుగు… విరామం లేకుండా… పని చేస్తోంది.  బామ్మ పేరు లి జియాంజు. చిన్నారి పేరు నానా. పసిగుడ్డుగా ఉన్నప్పుడు ఓ బ్రిడ్జికింద… చిన్న బాస్కెట్ లో దొరికింది. అప్పటి నుంచి ఆ చిన్నారి అల్లారు ముద్దుగా పెంచుకుంటుంది. అయితే ఆ అమ్మాయికి బోన్ కి సంబంధించిన వ్యాధి సోకింది. అరుదైన ఆ వ్యాధిగల వ్యక్తులు… నడవలేరు… ఏపనీ చెయ్యలేరు. అలాంటి అమ్మాయికి అన్నీ తానైంది బామ్మ. నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు అన్నీ బామ్మే చూసుకుంటుంది. స్కూల్ కు తీసుకెళ్లడం… చదివించడం కూడా చేస్తోంది. అమ్మానాన్నలు లేని లోటును పూడుస్తూనే ఆ చిన్నారికి… కొండంత అండగా నిలుస్తోంది. ఇది స్థానిక సీసీటీవీ, ఫేస్ బుక్ లలో రావడంతో … బామ్మపై ప్రశంసల వర్షం కురుస్తోంది. రక్తసంబంధాన్ని మించిన బంధం ఆ ఇద్దరి మధ్య అల్లుకుంది అంటున్నారు నెటిజన్లు. హ్యాట్సాఫ్ బామ్మ.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy