ఓ డ్రైవర్ ఆలోచన : ఇలా అడ్డం పెడితే గానీ ఆగరా!

elderly-woman_759సాధారణంగా ట్రాఫిక్ సిగ్నల్ పడితే తప్ప నడుచుకుంటూ వెళ్లేవారికి రోడ్డు దాటేందుకు ఎక్కువ సమయం ఇవ్వరు వాహనదారులు. కానీ చైనాలోని ఒక కారు డ్రైవరు మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించి అందరి ప్రశంశలు పొందాడు. వివరాల్లోకి వెలితే.. అది చైనాలోని రద్దీగా ఉండే రోడ్డు. అక్కడ ఒక 70 ఏళ్ల మహిళ జీబ్రా క్రాసింగ్ వద్ద నిలుచుంది. రోడ్డు దాటేందుక రెడీ అవుతున్నా.. బళ్లు వస్తూనే ఉన్నాయి.. పోతూనే ఉన్నాయి. ఆ వేగానికి ఆమె భయపడి.. ముందుకు అడుగు వేయలేక.. అక్కడే ఉండలేక… దిక్కులు చూస్తూ నిలుచుంది. ఎంతకూ ఎవరూ ఆగడం లేదు.  ఆ వృద్ధురాలి ఇబ్బందిని గమనించిన ఓ కారు డ్రైవరు తన కారును రోడ్డుకి అడ్డంగా పెట్టి ఆ మహిళ రోడ్డు దాటేందుకు అవకాశం కల్పించాడు. దీంతో ఆమె జాగ్రత్తగా జీబ్రా క్రాసింగ్ ను క్రాస్ చేయగలిగింది. పీపుల్స్ డైలీ చైనా ఈ వీడియో తమ ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు అందరి ప్రశంశలు పొందుతూ వందల షేర్లతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. మనుషుల్లో ఇంకా మానవత్వం చనిపోలేదంటూ.. హ్యాట్సాఫ్ అంటూ.. కామెంట్స్ చేశారు.

WATCH: Car blocks traffic to make way for elderly woman crossi…

WATCH: Car blocks traffic to make way for elderly woman crossing the street

People's Daily, China 发布于 2017年11月16日周四

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy