
మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. లోకల్ అధార్ కార్డుతో జియో సిమ్ తీసుకున్నవారికి ఎలాంటి సమస్య ఉండదు. నాన్ లోకల్ ఆధార్ తో తీసుకుంటే మాత్రం టెలీ వెరిఫికేషన్ చేయించుకోవాల్సిందే. జియో ఇప్పటికే ఈ స్క్రూటినీ ప్రక్రియ మొదలు పెట్టిందని సమాచారం. ( ఉదాహరణ : ఆధార్ కార్డ్ పై అడ్రస్ ఏపీది ఉండి.. తెలంగాణలో సిమ్ కార్డు తీసుకోవటం) ఏప్రిల్ 1 నుంచి ఈ వెరిఫికేషన్ ప్రక్రియ మొదలైంది. దీంతోపాటు కొంతమంది యూజర్లకు ఈ మేరకు SMSలను పంపిస్తుంది. నాన్ వెరిఫికేషన్ సిమ్ కార్డులను భద్రతా కారణాల క్రమంలోనే బ్లాక్ చేసే అవకాశం ఉంది. మీ సిమ్ వెరిఫికేషన్ అయ్యిందో లేదో ఓసారి చూసుకోండి. లేకుంటే సిమ్ బ్లాక్ అయ్యే అవకాశం ఉంది.