ఓ వీరజవానులారా.. మీ త్యాగం అజరామరం

niranjan- lt.colnolఆర్మీలో చేరడమే లక్ష్యమనుకున్నాడు. ఆలీవ్ గ్రీన్ డ్రెస్ ధరించడం కోసం కలగన్నాడు. అనుకున్నది సాధించాడు. కల్నల్ స్థాయికి ఎదిగాడు. ప్రాణంగా భావించిన ఉద్యోగంలోనే.. తుది శ్వాస విడిచాడు. కుటుంబంలో విషాదాన్ని నింపాడు. పఠాన్ కోట్ ఇన్సిడెంట్ లో చనిపోయిన అమర జవాన్ లెఫ్టినెంట్ కల్నల్ నిరంజన్ పై ప్రత్యేక కథనం…………

పఠాన్ కోట్ ఇన్సిడెంట్ లో చనిపోయిన ఏడుగురు సైనికుల్లో నిరంజన్ ఒకరు. కేరళకు చెందిన ఆయన.. చిన్నప్పుడే తల్లిని కోల్పోయారు. ఆ తర్వాత బెంగళూరులో చదువుకున్నారు. ఆర్మీలో ఉద్యోగం సంపాదించడమే లక్ష్యమని ఎప్పుడూ కుటుంబ సభ్యులతో చెబుతుండే వాడు. ఆర్మీలో జాయిన్ అయి అనుకున్నది సాధించారు. కొన్నేళ్లు జమ్మూకాశ్మీర్ లో పనిచేశారు. అక్కడి నుంచి మూడేళ్ల క్రితం నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ కు ఎంపికయ్యారు. ప్రస్తుతం లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్నారు నిరంజన్. టెర్రరిస్ట్ ఎటాక్ తర్వాత… ఓ గ్రేనెడ్ ను డిఫ్యూజ్ చేస్తూ ప్రమాదవశాత్తూ అది పేలడంతో ఆయన చనిపోయారు.

Friends and relatives arrive to pay tributes to Lt Col Niranjan Kumarనిరంజన్ కుమార్ మూడేళ్ల క్రితం రాధికను పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వారికి రెండేళ్ల కుమార్తె. నిరంజన్ చనిపోవడంతో.. బెంగళూరులో విషాదం నెలకొంది. ఆయన్ను తలచుకొని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. నిరంజన్ చనిపోవడం బాధగా ఉన్నా… దేశం కోసం ప్రాణాలర్పించడం గర్వంగా ఉందంటున్నారు ఫ్యామిలీ మెంబర్స్. నిరంజన్ మృతికి సంతాపం తెలిపారు కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్. ఆయన చనిపోవడం బాధాకరమని ట్వీట్ చేశారు.

Subedar_Fateh_Singh మరో ఛాంపియన్ షూటర్ ఫతే సింగ్ కూడా .. ఉగ్రదాడుల్లో చనిపోయారు. దీంతో.. ఆయన స్వగ్రామం పంజాబ్ లోని చాక్ షరీఫ్ లో విషాదం నెలకొంది. 2004లో ఆర్మీ నుంచి రిటైర్ అయిన తర్వాత.. 2006లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో చేరారు. రెండు నెలల క్రితమే పఠాన్ కోట్ కు ట్రాన్స్ ఫర్ అయ్యారు. 1995లో ఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ షూటింగ్ లో గోల్డ్, సిల్వర్ మెడల్ సాధించాడు ఫతేసింగ్. ఆయన మృతికి కేంద్ర క్రీడల మంత్రి సర్బానంద సోనోవాల్ నివాళులర్పించారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy