ఔటర్ కంప్లీట్ : కండ్లకోయ జంక్షన్ ప్రారంభం

KTRహైదరాబాద్ కు ఔటర్ వరప్రదాయిని అన్నారు మంత్రి కేటీఆర్. మంగళవారం (మే-1) ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణంలో భాగంగా పూర్తి చేసుకున్న కండ్లకోయ జంక్షన్‌ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. కండ్లకోయ వద్ద 1.10 కిలోమీటర్ల పొడవు గల ఈ ఎక్స్‌ప్రెస్‌ వేను రూ.125 కోట్ల వ్యయంతో నిర్మించారు. కండ్లకోయ జంక్షన్ పూర్తవడంతో 158 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు అందుబాటులోకి వచ్చింది.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..మౌలిక వసతులతోనే అభివృద్ధి సాధ్యం అవుతుందన్నారు. ఔటర్ చుట్టూ ఇంటర్ కనెక్టెడ్ గ్రిడ్ ఏర్పాటు చేసి.. హైదరాబాద్ ప్రజల మంచినీటి అవసరాలు తీర్చేలా ప్రణాళికలు తయారు చేస్తామన్నారు. హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అందులో భాగంగానే SRDP కింద అండర్‌పాస్‌ లు నిర్మిస్తున్నామని చెప్పారు. స్కైవేల కోసం డిజైన్ల బడ్జెట్ సిద్ధంగా ఉందన్నారు. రింగురోడ్డుపై వాహనాల వేగం నియంత్రణ కోసం హై టెక్నాలజీ మిషన్లను తీసుకొస్తున్నామన్నారు కేటీఆర్.

ఔటర్ రింగ్ రోడ్డులో LED లైట్స్ ఏర్పాటు చేసి.. ప్రమాదాలను అరికడుతున్నామని చెప్పిన కేటీఆర్.. భవిష్యత్తులో ఔటర్ చుట్టూ టౌన్ షిప్పులు కూడా రాబోతున్నాయని వెల్లడించారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల మొత్తం మున్సిపల్ పరిధిలోకి వచ్చిందని, ఔటర్ బయట కూడా డెవలప్ చేస్తామన్నారు. ట్రాపిక్ కు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో రోడ్డను విస్తరిస్తున్నామని, సుచిత్ర వరకు విఫరీతమైన ట్రాపిక్ ఉందని ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. రూ.10 కోట్లతో గండిపేట చెరువును అభివృద్ధి చేస్తామన్న ఆయన.. హైదరాబాద్ లో మంచినీటి కోసం 10 టీఎంసీల నీళ్లిస్తామన్నారు.  SRDPతో రోడ్ల అభివృద్ధికి ప్రణాళికలు చేస్తున్నామన్నారు మంత్రి కేటీఆర్.

Leave a Reply

Your email address will not be published.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy