కంచుకోటకు 50 ఏళ్లు

kanchukotaజానపద చిత్రాల్లోను సస్పెన్స్ థ్రిల్లర్‌గా సంచలనం సృష్టించిన తొలి చిత్రం ‘కంచుకోట’ కు ఏబై ఏళ్లు. ఎన్టీఆర్‌ బావమరిది యు.విశ్వేశ్వరరావు విశ్వశాంతి పిక్చర్స్‌ పతాకంపై నిర్మించిన సినిమా ‘కంచుకోట’.  ఇవాల్టితో 50 ఏళ్లు పూర్తిచేసుకుంటున్న ఆ చిత్రానికి సి.ఎస్.రావు దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమాకు కథ, స్ర్కీన్‌ప్లే త్రిపురనేని మహారథి. జానపదాల్లోనూ స్ర్కీన్ ప్లే అప్లై చేసి గ్రాండ్‌ సక్సెస్‌ అయిన సినిమా ఇది. 1967 మార్చి 22న విడుదలైన ఈ సినిమా ఓ ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచింది. ఈ సినిమా  నిర్మాణ వ్యయం ఏడు లక్షలు. మొదటివారమే ఏడు లక్షలు వసూలు చేసి అప్పట్లో సంచలనం సృష్టించింది కంచుకోట. ఈ సినిమా పేరు వినగానే గుర్తుకు వచ్చే పాట ‘సరిలేరు నీకెవ్వరూ…’

 అతిరథ మహారథుల  మేటి కలయిక 
‘కంచుకోట’లో ఎన్టీఆర్‌, కాంతారావు, ఉదయ్‌కుమార్‌, సావిత్రి, దేవిక, ధూళిపాల, ప్రభాకరరెడ్డి, పద్మనాభం, వాణిశ్రీ, రమణారెడ్డి, చిత్తూరు నాగయ్య తదితరులు నటించారు. కేవీ మహదేవన్ సంగీతం అందించగా ఆత్రేయ, దాశరథి, సి.నారాయణరెడ్డి, కొసరాజు, మహారథి పాటలు రాశారు. 1975లో ఈ చిత్రం రిపీట్‌ రన్లో హైదరాబాద్‌లో మూడు ఆటలతో వందరోజులు ఆడింది. రెగ్యులర్‌ షోస్‌తో రిపీట్‌ రన్లో సెంచరీ చూపిన తొలి భారతీయ చిత్రం కావడం మరింత విశేషం. ఈ సందర్భంగా 1975 డిసెంబర్‌ 5న హైదరాబాద్‌ శోభన థియేటర్‌లో ఈ చిత్ర రిపీట్‌ రన్ శతదినోత్సవం అతిరథ మహారథుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. తర్వాతి రోజుల్లో ఈ చిత్రాన్ని అనుసరించి పలు  జానపద చిత్రాలు రూపొందాయి. అయినప్పటికీ కంచుకోట స్థాయిలో అవి అలరించకలేకపోయాయి.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy