కంపించిన ఉత్తర భారతం

26brk144aఉత్తర భారతం కంపించింది. భూ ప్రకంపనలతో వణికింది. భయంతో జనం ఇళ్లు, ఆఫీసుల నుంచి బయటకు పరుగులు తీశారు. ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ కు 265 కిలోమీటర్ల దూరంలోని హిందూ ఖుష్ పర్వతాల కేంద్రంగా భూకంపం ఏర్పడింది. తీవ్రత రిక్టర్ స్కేల్ పై 7.7గా నమోదు అయ్యింది. జమ్మూకాశ్మీర్, ఢిల్లీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ భూ ప్రకంపనల తీవ్రత ఎక్కువగా ఉంది. ఢిల్లీ, జమ్మూకాశ్మీర్ లో నిమిషంపాటు భూమి కంపించింది. భూ ప్రకంపనలతో ఢిల్లీలోని మెట్రో సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. ముందస్తు జాగ్రత్తగా కొన్ని సర్వీసులు నిలిపివేశారు. 60 సెకన్లపాటు కంపించటంతో.. జనం భయాందోళనలో ఉన్నారు. జనం అంతా రోడ్లపైకి వచ్చారు.

delhi-earthquake-759

3499

భూకంప తీవ్రత – ప్రభావం :

  • భూకంప తీవ్రతకు జనం ఇళ్ల నుంచి పరుగులు పెట్టారు. ఢిల్లీలో ఆఫీసుల నుంచి బయటకు పరుగులు తీశారు. మెట్రో సేవలను తాత్కాలికంగా నిలిపేశారు.
  • జమ్మూ కాశ్మీర్ రాజధాని శ్రీనగర్ లో టెలిఫోన్, విద్యుత్ సేవలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. సమాచార వ్యవస్థ కట్ అయ్యింది. భయంతో పరుగులు పెట్టిన జనం రోడ్లై నిలిచిపోయారు.
  • చంఢీగర్ లో కూడా ఆఫీసుల నుంచి జనం బయటకు పరిగెత్తారు. కార్లు షేక్ అయ్యాయి.
  • భూకంప తీవ్రత ఎక్కువగా పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ లపై పడింది. భవనాలు కూలిపోయాయి. పాకిస్థాన్ లో 20 మంది చనిపోయారు. పాక్ లోని స్వాత్ లోయలో 100 మందికి పైగా గాయపడ్డారని సమాచారం.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy