కంపెనీల డేటా యుద్ధం : బెస్ట్ ఆఫర్ ఏదో తెలుసుకోండి

plansటెలికాం రంగంలో  ఆయా సంస్థల మధ్య విపరీతమైన పోటీ పెరిగింది. ఒకదానికి మించి మరొకటి ఆఫర్ల మీద ఆఫర్లు గుప్పిస్తున్నాయి. ముఖ్యంగా జియో ఫ్రీ ఆఫర్లు ప్రకటించడంతో ఈ పోటీ మరింత పెరిగింది. తక్కువ ధరకే ఎక్కువ డేటా అందిస్తూ వినియోగదారులను ఆఫర్లతో ఆకట్టుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నాయి.

 

జియో ఆఫర్స్:

జియో ప్రైమ్ మెంబర్ కోసం ప్రత్యేకంగా రూ. 399 ప్లాన్ ప్రకటించింది. 84 రోజుల కాలపరిమితి కలిగిన ఈ ప్లాన్ లో రోజుకు 1GB చొప్పున 84GB అందించనుంది.

గతంలో ప్రకటించిన జియో ధన్ ధనా ధన్ ఆఫర్ రూ.309 ప్లాన్ కాలపరిమితిని 84 రోజుల నుంచి 56 రోజులకు కుదించింది. 56GB డేటాతో.. రోజుకు 1జీబీ డాటా యథాతంగా అందిస్తోంది. అలాగే రూ.509 ప్లాన్ కింద రోజుకు 2జీబీ చొప్పున 56 రోజుల పాటు వాడుకోవచ్చు.

ఒడాఫోన్ ఆఫర్స్:

జియో ఆఫర్లను తట్టుకుని నిలబడేందుకు …అందుకు దీటుగా ఒడాఫోన్  రూ.349 రేంజ్‌లో ఓ ఆఫర్ ను అందుబాటులోకి తెచ్చింది. 28 రోజుల వ్యాలిడిటీతో వచ్చే ఈ ప్లాన్‌లో భాగంగా దేశవ్యాప్తంగా దేశంలో ఏ నెట్‌వర్క్‌కు అయినా ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చు. ల్యాండ్‌లైన్ కాల్స్ కూడా పూర్తిగా ఉచితం. ఎటువంటి రోమింగ్ ఛార్జీలు ఉండవు. ఈ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్‌తో పాటు  రోజుకి 1GB చొప్పున…28GB డేటాను అందించనుంది.

ఎయిర్ టెల్ ఆఫర్స్:

జియో ధనాధన్ ఆఫర్ ను తలదన్నేలా ఎయిర్ టెల్ సెన్సేషనల్ ఆఫర్ ఇచ్చింది. ప్రీపెయిడ్ వినియోగదారులు రూ.399తో రీఛార్జ్ చేసుకునే ఆఫర్స్ ను తీసుకొచ్చింది. దీంతో84 రోజుల పాటు 84 GB డేటాను అందించనుంది. దీనికి 4G హ్యాండ్ సెట్ తో పాటు4G SIM  ఉండాలి.

భారీ డేటా వినియోగానికి ఎయిర్టెల్ వినియోగదారులకు రూ .549 తో  మరో ప్లాన్ తీసుకొచ్చింది. రోజుకి 2GBతో  3G ,4G నెట్ వర్క్ ఇస్తుంది. అన్ లిమిటెడ్ కాల్స్ కూడా ఆఫర్ చేసింది. అయితే, ఈ ఆఫర్ 28 రోజులకు మాత్రమే వర్తిస్తుంది. దీనికి  4G హ్యాండ్ సెట్ కలిగిన మొబైల్ ఉండాలి.

ఐడియా ఆఫర్స్:

జియో తీసుకొచ్చిన ‘ధన్‌ ధనాధన్‌’కు పోటీగా కొత్త ఆఫర్లను ప్రకటించాయి మిగతా టెలీకాం రంగ సంస్థలు.  ఇందులో భాగంగా ఐడియా కూడా ఆఫర్లను ప్రకటించింది. రూ.399 తో రీచార్జ్ చైసుకుంటే అన్ లిమిటెడ్ కాల్స్ తో పాటు అన్ని నెట్ వర్క్ లకు ఉచితంగా 3వేల నిమిషాల వరకు ఫ్రీ కాల్స్ చేసుకోవచ్చు. రోజుకు 1GB తో 70 రోజుల పాటు 70 GB అందించనుంది. అంతేకాదు ఈ రీఛార్జీలో 5శాతాన్ని టాక్ టైమ్ గా ఇవ్వనున్నారు.

BSNL :

ఇటీవలే రూ.395 ఆఫర్ తీసుకొచ్చింది. రోజూ 2GB డేటా ఉచితం. 71 రోజుల వ్యాలిడిటీ. సేమ్ నెట్ వర్క్ లో 3వేల నిమిషాలు, ఇతర నెట్ వర్క్ లకు అయితే 1,800 నిమిషాలు ఫ్రీ.

సిక్సర్ 666 ప్యాక్ ఇది. ఏ నెట్ వర్క్ కు అయినా.. అన్ లిమిటెడ్ కాల్స్ తో పాటు రోజూ 2GB డేటా ఉచితం. ప్యాక్ వ్యాలిడిటీ 60 రోజులు. ఈ సేవలు 3G నెట్ వర్క్ ద్వారా అందించనున్నారు.

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy