కంపెనీ మూసుకోవాలి : జాన్సన్ కు రూ.32వేల కోట్ల జరిమానా

జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి భారీ జరిమానా విధించింది అమెరికా కోర్టు. ఆ కంపెనీకి చెందిన టాల్కమ్ పౌడర్‌ను వాడడం వల్ల క్యాన్సర్ వచ్చినట్లు దాఖలైన పిటీషన్‌లో కోర్టు ఈ తీర్పునిచ్చింది. ఆ పౌడర్ వల్ల అండాశయ క్యాన్సర్ వచ్చినట్లు కొందరు మహిళలు కంపెనీపై పిటీషన్ వేశారు. మిస్సోరీ కోర్టు ఈ తీర్పు ఇచ్చింది. నష్టపరిహారం కింద బాధితులకు రూ.32వేల కోట్లు (470 కోట్ల డాలర్లు) చెల్లించాలంటూ ఆదేశించింది. 22 మంది మహిళలకు ఆ నష్టపరిహారాన్ని అందజేయాలని ఆదేశించింది కోర్టు.

జాన్సన్ కంపెనీకి చెందిన బేబీ పౌడర్‌లో అస్‌బెస్టాస్ ఉన్నట్లు పరిశోధనలో తేల్చారు. దాని వల్లే ఒవేరియన్ క్యాన్సర్ వ్యాప్తి చెందినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జాన్సన్ కంపెనీ ఇలాంటివే 9 వేల కేసులను ఎదుర్కొంటోంది. ఇప్పటి జరిమానాను మాత్రం సెయింట్ లూయిస్‌లోని సర్క్యూట్ కోర్టు వేసింది. కోర్టు గది వ్యూవ్ నెట్‌వర్క్‌లో వాదనలు ఆన్‌లైన్‌లో లైవ్ అయ్యాయి. ఒక కేసులో ఓ మహిళకు 550 మిలియన్ల డాలర్ల ఫైన్ చెల్లించాలని తీర్పు ఇచ్చింది కోర్టు. ఈ తీర్పును కంపెనీ వ్యతిరేకిస్తుంది. అప్పీల్ కు వెళ్లనున్నట్లు తెలిపింది కంపెనీ. కోర్టు తీర్పు తర్వాత కంపెనీ షేర్లు ఒక్కసారిగా పడిపోయాయి.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy