కక్కేయండి.. కోట్లు పట్టుకెళ్లండి : బినామీ ఆస్తుల వివరాలు చెబితే భారీ నజరానా

detecticeరండి బాబూ రండి.. మీ దగ్గరున్న విలువైన సమాచారం చెప్పండి.. కోటి రూపాయలు గెలుచుకోండి.. మీ సమాచారం అంతకంటే ఎక్కువ.. మరింత విలువ అయినది అయితే 5 కోట్ల రూపాయల వరకు బహుమతిగా ఇస్తాం.. అంతే కాదండీ.. సమాచారం ఇచ్చిన వారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతాం.. ఎవరికీ తెలియకుండా దాచుతాం.. ఇది ఏ డిటెక్టివ్ కంపెనీ ప్రకటనలో కాదు.. కేంద్ర ప్రభుత్వం ఇన్ కం ట్యాక్స్ డిపార్ట్ మెంట్ ఇచ్చిన బంపరాఫర్.. భారతీయులు మాత్రమే కాదు.. విదేశీయులు కూడా అర్హులే అంటోంది.

దేశంలో బ్లాక్ మనీ వెలికితీయటం కోసం నోట్ల రద్దు చేసిన మోడీ సర్కార్.. ఇప్పుడు మరో సంచలన స్కీమ్ తీసుకొచ్చింది. దేశంలో బినామీ ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించింది. ఇందుకు తగ్గట్టుగానే కొత్త పథకం తీసుకొచ్చింది. బినామీ రివార్డ్స్ పేరుతో ఈ స్కీమ్.. జూన్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తోంది. సమాచార సేకరణ కోసం ఇన్ కం ట్యాక్స్ డిపార్ట్ మెంట్లో కొత్త విభాగాన్ని కూడా ప్రారంభించింది. దీనికి బినామీ నిరోధక విభాగంగా గుర్తింపు ఇచ్చింది. ఇందులో జాయింట్ కమిషనర్లు, అడిషనల్ కమిషనర్ల స్థాయి అధికారులకు బాధ్యతలు అప్పగించారు. వారికి సమాచారం ఇస్తే చాలు.. విచారణ చేసి.. పక్కా సమాచారం అయితే బినామీ ఆస్తులను స్వాధీనం చేసుకుంటుంది ప్రభుత్వం.

ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ నేతలు, కాంట్రాక్టర్లు, వ్యాపారవేత్తలు ఇలా సంపన్న వర్గాల్లోని కొందరు వందలు, వేల కోట్ల ఆస్తులను బినామీ పేర్లతో కొనుగోలు చేశారు. దీని వల్ల ఆదాయపు పన్ను నుంచి తప్పించుకుంటున్నారు. ఇదంతా కూడా బ్లాక్ మనీ అని భావిస్తోంది ప్రభుత్వం. దీన్ని స్వాధీనం చేసుకోవాలంటే బినామీ సమాచారం పక్కా ఉండాలి. అలా సమాచారం ఇచ్చిన వారికి కనీసం 50 లక్షలు నుంచి అత్యధికంగా 5 కోట్ల రూపాయల వరకు నజరానా కూడా ఇస్తామని ప్రకటించింది ఇన్ కం ట్యాక్స్ డిపార్ట్ మెంట్. సో.. మీ దగ్గరున్న బినామీ ఆస్తుల వివరాలు కక్కేయండి.. కోట్లు కొట్టేయండి అంటోంది..

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy