కచ్చితంగా తెలుసుకోవాలి : జియో కొత్త ప్లాన్స్.. ఎంతెంత డేటా

jio-fbజియో ఫ్రీ, ధనాధన్, సమ్మర్ సర్ ప్రైజ్ ముగిసింది. ఇక అంతా ప్లాన్సే. మరో 10రోజుల్లో ముగుస్తున్న సమ్మర్ సర్ ప్రైజ్ ప్లాన్స్ తో.. కొత్త ప్లాన్స్ రిలీజ్ చేసింది జియో.

ప్రీపెయిడ్ లో ప్లాన్ వివరాలు ఇలా ఉన్నాయి..

రూ.309 ప్లాన్ : 56 రోజుల వాలిడీటీ. రోజుకు 1GB డేటా.

రూ.349 ప్లాన్ : 56 రోజుల వాలిడిటీ ఉంటుంది. 10 GB డేటాను 28 రోజులకు ఇస్తారు. ఆ తర్వాత మరో 10GB డేటా యాడ్ అవుతుంది. 28 రోజులు గడవక ముందే 10 GB అయిపోతే స్పీడు 128 KBPSకి పడిపోతుంది.

రూ.399 ప్లాన్ : వాలిడిటీ 84 రోజులు. ప్రతిరోజూ ఒక GB డేటా వస్తుంది.

రూ.509 ప్లాన్ : 56 రోజుల వాలిడిటీ. మొత్తం 112 GB.. రోజుకు 2 GB వస్తుంది.

రూ.999 ప్లాన్ : ఈ ప్లాన్ వాలిడిటీ 90 రోజులు. ఒకేసారి 90 GB డేటా అందిస్తారు. రోజు వాడుకునే డేటాకు పరిమితి లేదు. 90 GB అయిపోయాక 128 KBPS స్పీడుతో ఇంటర్ నెట్ వినియోగించుకోవచ్చు.

రూ.1999 ప్లాన్: 155 GB డేటా..120 రోజుల వాలిడిటీతో ఈ ప్లాన్ ను ప్రకటించారు.

రూ.4999 ప్లాన్: 380 GB డేటా.. 210 రోజుల వాలిడిటీతో ఈ ప్లాన్ ను ప్రకటించారు.

రూ.9999 ప్లాన్: 780 GB డేటా.. 390 రోజుల వాలిడిటీతో ఈ ప్లాన్ ను ప్రకటించారు.

పోస్ట్ పెయిడ్ ఖాతాదారులకు ప్లాన్స్ ఇలా ఉన్నాయి…

రూ.309 ప్లాన్: 2 నెలల వాలిడిటీతో 60 GB డేటా అందిస్తూ రోజుకు 1 GB  డేటాను ఇస్తున్నారు.

రూ.349 ప్లాన్: ముందు ఒకే నెలకు ఉన్న వాలిడిటీని రెండు నెలలుగా మార్చారు.

రూ.399 ప్లాన్ : 90 GB డేటా మూడు నెలల వాలిడిటీతో ఈ ప్లాన్ మార్పు చేశారు.

రూ.509 ప్లాన్ : రోజుకు 2 GB డేటా ఇస్తూ.. 2 నెలల వాలిడిటీతో మొత్తం 120 GB ని అందిస్తున్నారు.

రూ.999 ప్లాన్ : 90 GB డేటాను 2 నెలల వాలిడిటీతో ప్లాన్ మారింది. కాని ఈ ఆఫర్ ను ఒక్కసారి మాత్రమే వినియోగించుకోవచ్చు.

అన్ని ఆఫర్లలో అన్ లిమిటెడ్ కాలింగ్.. అన్ లిమిటెడ్ మెసేజీలు అందిస్తున్న సంగతి తెలిసిందే.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy