కచ్చితంగా తెలుసుకోవాల్సిందే : GSTతో మీ ఫ్యామిలీ బడ్జెట్ మారింది

gst-billsGST.. ఒకే దేశం – ఒకే పన్ను విధానం. జూలై ఒకటో తేదీ నుంచి అమల్లోకి రాబోతుంది. ఏ వస్తువుపై ఎంతెంత భారం పడనుంది. నిత్యం మనం ఉపయోగించే వస్తువులతోపాటు నిత్యావసరంగా మారిన అవసరాలపై భారం పడుతుందా – తగ్గుతుందా అనేది అందరిలో చర్చనీయాంశం అయ్యింది. ఫ్యామిలీ బడ్జెట్ పై జీఎన్టీ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో డీటెయిల్డ్ గా చూద్దాం..

లైఫ్ ఇన్సూరెన్స్ :

మీ ప్రీమియం రూ.15 వేలు అనుకుంటే. ప్రస్తుతం మీరు రూ.2వేల 250 ట్యాక్స్ చెల్లిస్తున్నారు. GST పరిధిలోకి వచ్చిన రూ.2,700 చెల్లించాల్సి ఉంటుంది. అంటే 450 రూపాయలు భారం కానుంది.

బంగారం ఆభరణాలు:

రూ.60వేల విలువైన ఆభవరణాలు కొనుగోలు చేస్తే ఇప్పటి వరకు రూ.1,800 ట్యాక్స్ ప్రస్తుతం చెల్లిస్తున్నారు. జీఎస్టీ పరిధిలోకి వచ్చిన తర్వాత రూ.2వేలు కట్టాల్సి ఉంటుంది. అంటే రూ.200 భారం పడుతుంది. ఇప్పటి వరకు 2 నుంచి 2.5శాతంగా ఉన్న ట్యాక్స్ రేటును ఇప్పుడు 3శాతం పరిధిలోకి తీసుకొచ్చారు.

హోటల్  విడిది :

మీరు తీసుకునే గది అద్దె రూ.7వేలు ఉంటే ప్రస్తుతం రూ.1400 ట్యాక్స్ చెల్లిస్తున్నారు. GSTలోకి వస్తుండటంతో అది రూ.1960 అవుతుంది. వెయ్యిలోపు అద్దె గదులు GST పరిధిలోకి రావు.

వంట నూనె – రిఫయిన్డ్ కుకింగ్ ఆయిల్ :

రూ.200 విలువైన వంట నూనె కొనుగోలు చేస్తున్నట్లయితే ప్రస్తుతం రూ,.23 ట్యాక్స్ చెల్లిస్తున్నారు. GST పరిధిలోకి రావటం వల్ల కేవలం 10 రూపాయలు మాత్రమే పన్ను పడుతుంది. అంటే వంటింట్లోకి అదనంగా చిల్లర వచ్చినట్లే.

టెలికాం :

మీ ఇంట్లో రెండు ఫోన్లు, ఓ డీటీహెచ్ సర్వీస్ ఉన్నాయి. ఇప్పుడు ఇది కామన్. ప్రస్తుతం మీరు కనీసంగా రూ.2,500 బిల్లు చెల్లిస్తున్నారు. అంటే రూ.375 ట్యాక్స్ కడుతున్నారు. GST పరిధిలోకి వచ్చిన తర్వాత రూ.450 చెల్లించాల్సి ఉంటుంది. అంటే రూ.75 అదనంగా భారం పడుతుంది.

రెస్టారెంట్ బిల్లు :

ఇద్దరు పెద్దలు, ఇద్దలు పిల్లలు కలిసి ఫ్యామిలీ రెస్టారెంట్ కు వెళితే రూ.2వేలు బిల్లు అయితే ప్రస్తుతం రూ.270 పన్ను కడుతున్నారు. GST పరిధిలోకి వచ్చిన తర్వాత మీరు చెల్లించాల్సింది రూ.360. అంటే 90 రూపాయలు అదనపు భారమే.

రెడీమేడ్ దుస్తులు :

రూ.2వేల రెడీమేడ్ దుస్తులు కొనుగోలు చేస్తే ప్రస్తుతం మీరు చెల్లిస్తున్నది రూ.130 ట్యాక్స్. GST పరిధిలోకి రావటం వల్ల మీరు రూ.240 పన్ను కట్టాలి. అంటే అదనంగా మీపై పడి భారం రూ.110.

సినిమా వినోదం :

నలుగురి ఫ్యామిలీ మల్టీఫ్లెక్స్ కు సినిమాకు వెళితే రూ.1200 ఖర్చు అవుతుంది. అందుకు మీరు ప్రస్తుతం చెల్లిస్తున్న ట్యాక్స్ రూ.360. GST పరిధిలోకి వచ్చిన తర్వాత రూ.336 కట్టాల్సి ఉంటుంది.

రైలు ప్రయాణం – A/C :

మూడు వేల రూపాయల విలువైన టికెట్లు మీరు కొనుగోలు చేస్తే ప్రస్తుతం కడుతున్న పన్ను రూ.131 మాత్రమే. ఇక నుంచి రూ.150 కట్టాలి. అంటే రూ.19 అదనంగా చెల్లిస్తారు GSTలో.

మొత్తంగా ఓ మధ్య తరగతి కుటుంబంపై GST భారం కనిపిస్తోంది. వీకెండ్ ఎంజాయ్ చేద్దామంటే జేబుల్లో నుంచి మరిన్ని నోట్లు బయటకు తీయాల్సిందే. ఫోన్ బిల్లుల మోత మోగనుంది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy