‘కణం’ ట్రైలర్.. రిలీజ్

kanamఫిదా సినిమాలో భానుమతిగా న‌టించిన సాయిప‌ల్ల‌వి తెలుగు ప్రేక్షకుల్ని నిజంగానే ఫిదా చేసింది. తెలంగాణ అమ్మాయిగా ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు లభించాయి. తెలుగు రాష్ట్రాలతోపాటు ఓవర్సీస్‌లోనూ ఆ మూవీ భారీ కలెక్షన్లు రాబట్టింది. తర్వాత నానితో కలిసి మిడిల్ క్లాస్ అబ్బాయి సినిమా ట్రైలర్‌తోనూ సాయి పల్లవి ఆకట్టుకొంది. ఈ మూవీ డిసెంబ‌ర్ 21న విడుద‌లకు ముస్తాబవుతోంది. యంగ్ హీరో నాగ శౌర్య సరసన ఓ ద్విభాషా మూవీలో సాయి పల్లవి నటిస్తోంది.

‘కణం’ పేరిట నిర్మిస్తున్న ఈ  సినిమాను తమిళంలో ‘కరు’గా తెరకెక్కిస్తున్నారు. ఏఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా ద్వారా ఆమె తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతోంది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమా ట్రైల‌ర్ తాజాగా విడుద‌లైంది. సారీ అమ్మా, చేసింది తప్పే.. అలా ఏమీ వద్దమ్మా అంటూ సాయి పల్లవి చెప్పే డైలాగ్‌లతో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. ఈ మాటలతోపాటు కణం టైటిల్, ట్రైలర్‌ను బట్టి అబార్షన్ క్రమంలో ఈ సినిమా సాగుతుందని తెలుస్తోంది.

హారర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీలో సాయిపల్లవి నాలుగేళ్ల పాపకి తల్లిగా కనిపించనుంది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy