కతువా ఘటన : అమితాబ్ పై ప్రకాష్ రాజ్ కామెంట్స్

PRAKSH AMITHABదేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కతువా మానభంగం, హత్య ఘటనపై అమితాబ్ బచ్చన్ స్పందించకపోవడంపై  విచారం వ్యక్తం చేశారు నటుడు ప్రకాష్ రాజ్. అమితాబ్ ను దీని గురించి మాట్లాడాలని కోరానని ఆయన అన్నారు.

అయితే అమితాబ్ మాత్రం తాను మాట్లాడనని చెప్పి ఊరుకున్నారని చెప్పారు ప్రకాష్ రాజ్.  అమితాబ్ ది అధ్బుత స్వరం అని ఆయన అన్నారు. కథువా ఘటన మత విభేదాల క్రమంలో జరిగింది కాదు. ఓ ప్రాంతం నుంచి గెంటేయడానికి కొందరు వ్యక్తులు బెదిరింపుగా చేసిన అఘాయిత్యం. ఒకే మతానికి చెందినవారైతే వారికే మద్దతు పలుకుతారు. వారి కోసం ఆందోళనల్లో పాల్గొంటారు. అమితాబ్ దీనిపై మాట్లాడి ఉంటే బాగుండేది అని చెప్పారు ప్రకాష్. శుక్రవారం మే-11న ట్విట్టర్ ద్వారా స్పందించిన ప్రకాష్ రాజ్.. అమితాబ్ పై అసంతృప్తి వ్యక్తం చేశారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy