కథ రొటీన్.. కథనంలో కాస్త వెరైటీ

Srirastu-Subhamastuరివ్యూ: శ్రీరస్తు శుభమస్తు-

రేటింగ్: 3/5

నిడివి: 2 గంటల 18 నిమిషాలు

నటీనటులు: అల్లు శిరీష్, లావణ్య త్రిపాఠి, రావు రమేష్, ప్రకాష్ రాజ్, సుమలత, తనికెళ్ల భరణి, అలీ, ప్రభాస్ శీను, సుబ్బరాజు, ప్రగతి సంగీతం: థమన్

సినిమాటోగ్రఫీ: మణి కంఠన్

ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్

నిర్మాత: అల్లు అరవింద్

రచన-దర్శకత్వం : పరశురామ్ (బుజ్జి)

ఇంట్రడక్షన్:

‘‘గౌరవం’’, ‘‘కొత్త జంట’’ సినిమాలతో నిరాశ చెందిన అల్లు శిరీష్.. రెండేళ్ల కు పైగా గ్యాప్ తీసుకొని ‘‘శ్రీరస్తు శుభమస్తు’’ అనే సాఫ్ట్ టైటిల్ తో ఆడియన్స్ ముందుకొచ్చాడు…ఎమోషన్స్ ను బాగా పండించగలడు అనే పేరు తెచ్చుకున్న పరశురామ్ డైరెక్టర్ కావడంతో ఈ సినిమా మీద ఇంట్రస్ట్ ఏర్పడింది.. దానికితోడు పోస్టర్లు, ట్రైలర్లు బాగుండటంతో రిలీజ్ కు ముందు సినిమా మీద పాజిటివ్ వైబ్స్ ఏర్పడ్డాయి.. మరి ఈ సినిమా అయినా అల్లు శిరీష్ ను గట్టెక్కించిందా?

కథేంటి?

సంపన్నుల కుటుంబంలో పుట్టిన శిరీష్ తొలిచూపులోనే అనన్య (లావణ్య త్రిపాఠి) ను ప్రేమిస్తాడు. అయితే మధ్య తరగతి వాళ్లంతా సెక్యురిటీ కోసమే సంపన్నులను పెళ్లి చేసుకోవాలకుంటారనే అభిప్రాయంతో ఉంటాడు శిరీష్ తండ్రి (ప్రకాష్ రాజ్).. ఆ అభిప్రాయం తప్పనీ.. సామాన్యుడిగా వెళ్లి ఆ అమ్మాయి ప్రేమను గెలుస్తానని తండ్రితో చాలెంజ్ చేస్తాడు శిరీష్.. ఈ నేపథ్యంలో శిరీష్ ఎదుర్కున్న అనుభవాలేంటో సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

నటీనటుల పర్ఫార్మెన్స్:

మొదటి రెండు సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో శిరీష్ నటన చాలా మెరుగుపడింది.. కామెడీ సీన్లు, టీజింగ్ సీన్లల్లో కాన్ఫిడెన్స్ తో కనిపించాడు. ప్రీ క్లైమాక్స్ లో ప్రకాష్ రాజ్ తో చెప్పే సీన్ బాగా చేశాడు..కానీ ఎమోషన్ సీన్లల్లో ఇంకా మెరుగవ్వాల్సిన అవసరం ఉంది.. లావణ్య త్రిపాఠి అందంగా కనిపించింది.. నటనలో కూడా మెప్పించింది..ఈ నడుమ అధ్బుతమైన ఫామ్ లో ఉన్న రావు రమేష్ కు మరో మంచి క్యారెక్టర్ దక్కింది.. ప్రకాష్ రాజ్ మరో బొమ్మరిల్లు ఫాదర్ లాంటి క్యారెక్టర్ చేశాడు.. . ఫస్టాఫ్ లో ప్రభాస్ శీను.., సెకండాఫ్ లో అలీ కడుపుబ్బ నవ్వించారు.. తనికెళ్ల భరణి, సుమలత, సుబ్బరాజు ఫర్వాలేదనిపిస్తారు.

టెక్నీషియన్స్ వర్క్:

ఈ మధ్య మాస్ కమర్షియల్ సినిమాలకు తమన్ ఇస్తున్న డ్రమ్స్ మ్యూజిక్ నుంచి ఇది కాస్త రిలీఫ్ నిస్తుంది.. పాటలల్లో ‘‘టైటిల్ సాంగ్, ‘‘అను, అను’’ అనే రెండు పాటలు బాగున్నాయి.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్లజెంట్ గా ఉంది.. సినిమాటోగ్రాఫర్ మణి కంతన్ సినిమాను అందంగా చూపించాడు… ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.. మార్తాండ్ .కె.వెంకటేష్ ఎడిటింగ్ క్రిస్ప్ గా ఉంది.. డైరెక్టర్ పరశురామ్ ఈ సినిమాలో తనలోని డైలాగ్ రైటర్ కు పనిచెప్పాడు. కొన్ని ఎమోషనల్ డైలాగులు ఎఫెక్టివ్ గా ఉన్నాయి..

1. ‘‘మనమంటే గిట్టనివాళ్లు.. మనకు ఎప్పుడు కష్టాలొస్తాయా.. ఓదారుద్దామని ఎదురు చూస్తుంటారు.. కానీ మనం సక్సెస్ అయినప్పుడు ఎలాంటి ఈగోలు లేకుండా మన సక్సెస్ ను సెలబ్రేట్ చేసేవాళ్లు తక్కువ..’’

2. ‘‘ప్రేమను వ్యక్తం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాను కానీ.. గమనించ లేనంత గుడ్డిదాన్ని మాత్రం కాదు’’

3. ‘‘మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబాలు త‌మ అమ్మాయిని డ‌బ్బున్న వాళ్లింటికి కోడ‌లిగా పంపించాలనుకుంటారు కానీ, అక్క‌డ డ‌బ్బు మాత్ర‌మే ఉంటుందంటే, ఏ తండ్రీ త‌న కూతురిని అలాంటి ఇంటికి పంపించడు’’

ప్లస్:

1. డైలాగ్స్

2. కామెడీ

3. క్లైమాక్స్

మైనస్:

1. రొటీన్ కథ

విశ్లేషణ:

శ్రీరస్తు శుభమస్తు కథ కొత్తదేం కాదు.. ఈ సినిమా చూస్తుంటే అప్పటి ‘దిల్ వాలే దుల్హనియా లేజాయింగే’’ నుంచి మొన్నటి బొమ్మరిల్లు, రీసెంట్ నేను శైలజ’’ వరకు ఎన్నో సినిమాలు గుర్తొస్తాయి..కానీ ఇలాంటి రొటీన్ పాయింట్ ను డైరెక్టర్ బాగానే హ్యాండిల్ చేశాడనే చెప్పాలి.. బోర్ కొట్టని కథనం, కామెడీ సీన్లు,సెంటిమెంట్ సీన్లతో సినిమాకు కమర్షియల్ కలర్ ఇచ్చాడు.. అయితే ఫస్టాఫ్ లో లవ్ ట్రాక్ అంత కన్విన్సింగ్ గా అనిపించదు…సెకండాఫ్ లో హీరోయిన్ ఇంట్లో సెటిల్ అయి తన పెళ్లి చెడగొట్టటం అనేది ఈ మధ్య చాలా సినిమాల్లో వస్తున్న రొటీన్ ఎపిసోడ్.. అది కాస్త విసిగించినా.. అలీ, సుబ్బరాజుల కామెడీ రిలీఫ్ నిస్తుంది.. ఇక క్లైమాక్సే ఈ సినిమాకు హైలెట్.. చివరి రెండు,మూడు సీన్లల్లో పరశురామ్ రాసిన కొన్ని ఎమోషనల్ డైలాగ్స్ ఆడియన్స్ కు బాగా కనెక్టవుతాయి.. కొత్తదనం ఏమి లేకపోయినా.. ఒక కమర్షియల్ ఫ్యామిలీ సినిమాకు కావాల్సిన అన్ని హంగులు ఉండటంతో ఒక సారి చూసి ఎంజాయ్ చెయ్యొచ్చు..

బాటమ్ లైన్: శ్రీరస్తు శుభమస్తు- ఫర్వాలేదనిపించే ఫ్యామిలీ ఎంటర్ టైనర్

(సురేష్ కొండి)

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy