కనిపించని అంకెలు : ఆధార్ కు వర్చువల్ ఐడీ భద్రత

aadhaar

ఆధార్.. దేశంలోని ప్రతి ఒక్కరికీ ఇది ఆధారం. మన డేటా భద్రతపై అనుమానాలు. 500కే అంగటి సరుకు అయ్యింది. ఎవరికి పడితే వారి చేతిలో డేటా పడిపోయింది. దేశ ఆర్థిక వ్యవస్థమే ముప్పు అని స్వయంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెర్చర్లు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఆధార్ కార్డు జారీ, భద్రతను చేపట్టిన యూనిక్ ఐడెంటిఫికేన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ప్రస్తుత విధానాన్ని పూర్తి మార్చివేయబోతున్నది. ఆధార్ డేటాను సురక్షితంగా ఉంచేందుకు.. మరొకరికి తెలియకుండా ఉండేందుకు రెండు కొత్త విధానాలను తీసుకురాబోతున్నది. ఒకటి వర్చువల్ ఐడీ, రెండోది లిమిటెడ్ KYC(నో యువర్ కస్టమర్). ఈ రెండు విధానాలతో వ్యక్తిగత సమాచారాన్ని భద్రంగా ఉంచొచ్చని నిర్ణయించింది. జూన్ 1, 2018 నుంచి అమల్లోకి తీసుకురాబోతున్నది. ఇందుకు ఏజెన్సీలు కూడా సిద్ధంగా ఉండాలని కూడా ఆదేశించింది.

ఒకటి వర్చువల్ ఐడీ. ఈ విధానంలో మీరు ఎవరికైనా ఆధార్ వివరాలు చెప్పానుకున్నప్పుడు మొత్తం డీటెయిల్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కార్డు కూడా చూపించాల్సిన అవసరం లేదు. నెంబర్ చెప్పాల్సిన అవసరం లేదు. ఆన్ లైన్ లో మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే అప్పటికప్పుడు 16 అంకెల వర్చువల్ ఐడీ నెంబర్ వస్తుంది. కనిపించని ఈ 16 అంకెల వర్చువల్ కోడ్ ను.. సంబంధిత కంపెనీకి ఆ నెంబర్ చెప్పగానే ఆటోమేటిక్ గా మన ఆధార్ లింక్ అయిపోతుంది. ఇలా మీరు ఆధార్ డీటెయిల్స్ ఇవ్వాల్సిన ప్రతిసారీ వర్చువల్ ఐడీ రూపంలో జనరేట్ అయ్యే 16 అంకెల నెంబర్ ఇస్తే సరిపోతుంది. ఈ నెంబర్ ఎలా జనరేట్ అవుతుంది.. దీని విధివిధానాలు ఏటీ.. ఎలా దీన్ని సమర్పించాలి అనేది ఇంకా నిర్ణయించలేదు.

రెండో విధానం లిమిటెడ్ KYC. మన ఆధార్ డేటా సమాచారం ఏజెన్సీలకి కూడా కనిపించదు. కేవలం పేరు, అడ్రస్, కొన్ని వివరాలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఏజెన్సీలు కూడా పూర్తి వివరాలు తెలుసుకోకుండా లిమిటెడ్ KYC విధానం తీసుకువస్తారు. ఈ రెండు విధానాల ద్వారా ఆధార్ డేటాను భద్రం చేయొచ్చని నిర్ణయించింది అథారిటీ. ఇందుకు కసరత్తు కూడా మొదలుపెట్టింది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy