కనిపించిన నెలవంక.. ఆదివారం నుంచి రంజాన్ మాసం

ramzan-2017పవిత్ర మాసం రంజాన్ ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. శనివారం నెలవంక దర్శనం ఇవ్వడంతో ఇమామ్‌లు రంజాన్ మాసాన్ని ప్రకటించారు. ముస్లింలు పరస్పరం ఆత్మీయ శుభాకాంక్షలు తెలుపుకుంటూ రంజాన్ మాసాన్ని ఆహ్వానించారు. నగరంలోని మసీదులన్నీ ఇప్పటికే ఈ వేడుక‌కు ముస్తాబయ్యాయి. పవిత్ర ప్రార్థనలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.

ఉపవాసాలు ప్రారంభం

రంజాన్.. ముస్లింలకు పవిత్రమైన పండగ. రంజాన్  నెలంతా ముస్లింలు …..ఉపవాసాలు ఉంటారు. సూర్యోదయం ముందు భోజనాన్ని ముగిస్తారు. దీన్నే సహర్ అంటారు. సూర్యాస్తమయం తరువాత….ఉపవాస దీక్షను విరమిస్తారు. ఆహారాన్ని తీసుకుంటారు. దీన్నే ఇఫ్తార్ అంటారు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు అంటే దాదాపు 13 గంటల పాటు ఎలాంటి ఆహారాన్ని తీసుకోరు.

రమదాన్ పండగ సందర్భంగా ముస్లింలు వాళ్ల  ఆర్థిక స్థోమతను బట్టి దానం చేయాల్సి ఉంటుంది.దీన్నే జకాత్ అంటారు. అయితే, ఇది డబ్బులున్నోళ్లకే పరిమితం. ఫిత్రా….ఇది కూడా జకాత్ లాంటిదే. మధ్య తరగతి వాళ్లు కూడా ……ఫిత్రా ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే …..రమదాన్ పండగను….ఈద్ ఉల్ ఫితర్ అని కూడా అంటారు.

రమదాన్  అనగానే……ఎవరికైనా వెంటనే  గుర్తుకు వచ్చేది ….హలీం.  సాయంత్రం అయ్యేసరికి…..హైదరాబాద్  సహా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని నగరాల్లో హలీం బట్టీల దగ్గర సందడి నెలకొంటుంది. రమదాన్  నెలలో చివరి వారం అంతా షాపింగ్ హడావిడే కనిపిస్తుంది.  రమదాన్  షాషింగ్ తో  రాత్రి వేళల్లో …హైదరాబాద్ నగరం కళకళలాడుతుంటుంది.

నెల రోజుల తరువాత….నెల పొడుపు కనిపిస్తే….ఉపవాసాలు విరమించి….పండగ చేసుకుంటారు. పండగ రోజు  చుట్టాలను, దోస్తుల్ని  ఇళ్లకు పిలుస్తారు.  సేమ్యా, షీర్ ఖుర్మా వంటి ఫుడ్ ఐటమ్స్ తో నోరు తీపి చేస్తారు. దోస్తుల మధ్య రమదాన్ పండగను  ఖుషీగా  జరుపుకుంటారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy