కనువిందు చేసిన చంద్రగ్రహణం

moonపాక్షిక చంద్రగ్రహణం ముగిసింది. నిన్న రాత్రి 10 గంటల 52 నిమిషాలకు మొదలైన గ్రహణం…. అర్ధరాత్రి 12 గంటల 48 నిమిషాల వరకు కొనసాగింది. కేతుగ్రస్త చంద్రగ్రహణం కారణంగా తెలుగు రాష్ట్రాలలో ఆలయాలు మూసివేశారు. యాదాద్రి, వేములవాడ, ధర్మపురి, బాసర, భద్రాచలం ఆలయాల్లో మధ్యాహ్న పూజ తర్వాత నివేదన పెట్టి…గుళ్లను ముసేశారు. తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు తిరుచానూరు పద్మావతి ఆలయాన్ని మూసివేశారు అర్చకులు. గ్రహణం వీడాక ఆలయ సంప్రోక్షణ తర్వాత…సుప్రభాత సేవలతో.. దర్శనాలను మొదలు పెట్టారు. చంద్రగ్రహణం సోమవారం రావడంతో ప్రత్యేకత ఉందంటున్నరు పండితులు. ఇది చాలా అరుదుగా వస్తుందని… ఈ గ్రహణ సమయంల చేసే జప,దాన,హోమాలకు కోటిరెట్ల ఫలం ఉంటుందని చెప్తున్నారు.

మరోవైపు టర్కీ, జర్మనీ, గ్రీక్ లలో పాక్షిక చంద్రగ్రహణం కనువిందు చేసింది. బ్లడ్ మూన్ గా చెబుతున్నారు ఖగోళవేత్తలు. ఎరుపు, నారింజ రంగుల్లో కనిపించింది. బ్రిటన్ లో అయితే సోమవారం రాత్రి 8.30 నుంచే చందమామ కనిపించలేదు. చంద్రగ్రహనాన్ని కెమేరాల్లో బంధించడానికి ఉత్సాహం చూపించారు ఔత్సాహికులు. ఇదిలా ఉంటే ఆగస్ట్ 21న సంపూర్ణ సూర్యగ్రహణం ఉండటంతో దానిపై దృష్టిపెట్టారు ఖగోళవేత్తలు.  ఇప్పటికే సోషల్ మీడియాలో దీనిపై ప్రచారం మొదలైంది. ఆ సమయంలో ఫోన్ లు ఉపయోగించరాదని.. లోడ్ ఎక్కువయ్యే అవకాశముందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy