కన్నడ తీర్పు : రేపే ఎన్నికల ఫలితాలు

kkగెలుపు మాదే.. మాకు 130 సీట్లు వస్తాయని ఒకరు.. మాకు అంతకంటే ఎక్కువే వస్తాయని ఇంకొకరు. వాళ్లిద్దరూ నా దగ్గరకు రావాల్సిందేనని మరొకరు.. ఇలా ఫలితాలకు ముందురోజే కర్ణాటకలో రాజకీయాలు హీటెక్కాయి. హంగ్ వచ్చినా.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఎవరి ఎత్తులు.. పైఎత్తుల్లో వారున్నారు.

ఎన్నికల ఫలితాల ముందు రోజు కర్ణాటకలో రాజకీయాలు మరింత హీటెక్కాయి. కాంగ్రెస్, బీజేపీలు కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది తామేనని చెప్పుకుంటున్నాయి. తమకు 130 సీట్లు రావడం ఖాయమన్నారు బీజేపీ సీఎం అభ్యర్థి యెడ్యూరప్ప. జేడీఎస్ తో పొత్తు ప్రసక్తే ఉండబోదన్నారు.

మరోవైపు దళితుడిని సీఎం చేసేందుకు తాను పదవి వదులుకునేందుకు రెడీగా ఉన్నాన్నన సిద్ధరామయ్య మాటలు కూడా ఆసక్తికరంగా మారాయి. అయితే.. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే సీఎం ఎవరనేది హైకమాండే నిర్ణయిస్తుందన్నారు పార్టీ లోక్ సభా పక్ష నేత మల్లికార్జున ఖర్గే. ఇంకొన్ని గంటల్లో అన్ని విషయాలు తేలుతాయన్నారు.

మరోవైపు.. పోలింగ్ ముగిసిన వెంటనే సింగపూర్ ఫ్లైట్ ఎక్కారు జేడీఎస్ సీఎం అభ్యర్థి కుమారస్వామి. ప్రచారంతో అలసిపోయి.. రెస్ట్ కోసమే అక్కడికి వెళ్లారని పార్టీ నేతలు చెబుతున్నా.. అసలు విషయం మాత్రం వేరే ఉందనే ప్రచారం నడుస్తోంది. కర్ణాటకలో హంగ్ పరిస్థితులే వస్తాయని.. ఎగ్జిట్ పోల్స్ దాదాపు కన్ఫామ్ చేశాయి. దీంతో బీజేపీ, కాంగ్రెస్ నేతలతో కుమారస్వామి రహస్య మంతనాలు జరుపుతున్నారనే ప్రచారం కొనసాగుతోంది. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే రెండు పార్టీలకు తమ అవసరం ఉందని గుర్తించిన కుమారస్వామి.. సింగపూర్ వేదికగా వ్యవహారం నడిపిస్తున్నారని చర్చ జరుగుతోంది.

కర్ణాటకలో బీజేపీకి మెజార్టీ రాకుంటే రాష్ట్రపతి పాలన విధిస్తుందని ఆరోపించారు శివసేన నేత సంజయ్ రౌత్. అటు.. తాను కింగ్ మేకర్ నని జేడీఎస్ నేతలు చెప్పుకోవడం రాజ్యాంగవిరుద్ధమన్నారు. బీజేపీ, కాంగ్రెస్ లు మ్యాజిక్ ఫిగర్ ను చేరుకోకపోతే.. వారితో దేవేగౌడ బేరమాడేందుకు ప్రయత్నిస్తున్నారని.. ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదన్నారు.

మరోవైపు.. ఓట్ల కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. కౌంటింగ్ కేంద్రాల దగ్గర భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. కర్ణాటకలో కింగ్ ఎవరనేది రేపు మధ్యాహ్నానికి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy