కన్నడ రాజ్ భవన్ లో హైడ్రామా : జేడీఎస్ లో చీలిక

RAJకర్నాటక ఎన్నికల ఫలితాలు ఎంత ఆసక్తి రేపాయి.. అంతకంటే ఎక్కువగా రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాకపోవటంతో.. అధికారం కోసం పార్టీలు ఎత్తులు – పైఎత్తులు వేస్తున్నాయి. కింగ్ అయిన జేడీఎస్ కు సీఎం పదవి ఇస్తామంటూ కాంగ్రెస్ ఓపెన్ ఆఫర్ ఇచ్చింది. దీన్ని స్వీకరించిన జేడీఎస్ చీఫ్ కుమారస్వామి వెంటనే స్పందించారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని.. మద్దతు తెలపటానికి అవకాశం ఇవ్వాలని కర్నాటక గవర్నర్ వాజుభాయ్ ను రాజ్ భవన్ లో కలిసి విన్నవించారు.

గవర్నర్ కు జేడీఎస్ చీఫ్ కుమారస్వామి లేఖ రాయటం కంటే ముందే.. కాంగ్రెస్ పీసీసీ చీఫ్ పరమేశ్వర్ రాజ్ భవన్ చేరుకున్నారు. అయితే అపాయింట్ మెంట్ లేకపోవటంతో గవర్నర్ ను కలుసుకోవటం సాధ్యం కాలేదు. ఆ తర్వాత జేడీఎస్ చీఫ్ కుమారస్వామి లేఖ రాయటం.. ఆయన అపాయింట్ మెంట్ ఇవ్వటం చకచకా జరిగిపోయాయి. కాంగ్రెస్ – జేడీఎస్ ఈ పరిణామాలతో బిజీగా ఉన్న సమయంలోనే బీజేపీ షాక్ ఇచ్చింది.

బీజేపీ సీఎం అభ్యర్థి యడ్యూరప్ప కాంగ్రెస్, జేడీఎస్ కంటే ముందే.. రాజ్ భవన్ లో గవర్నర్ వాజుభాయ్ తో భేటీ అయ్యారు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీకి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరారు. అందుకు సంబంధించిన లేఖను అందజేశారు. అత్యధిక సీట్లు గెలిచిన పార్టీగా ఆ హక్కు మాకే ఉందని యెడ్డీ తెలిపారు.

జేడీఎస్ లో చీలిక :

గవర్నర్ తో భేటీ అయిన యడ్యూరప్ప.. ప్రభుత్వ ఏర్పాటుపై ధీమా వ్యక్తం చేశారు. జేడీఎస్ లో నెంబర్ టూ, కుమారస్వామి సోదరుడు హెచ్.డి.రేవణ్ణ మద్దతు మాకే ఉందని బీజేపీ వర్గాలు తెలిపాయి. రేవణ్ణ వెంట 12 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. వారి మద్దతు బీజేపీకే ఉందని చెబుతున్నారు. ఈ పరిణామాలు జేడీఎస్ లో కలకలం రేపాయి. రేవణ్ణకు డిప్యూటీ సీఎంతోపాటు రెండు మంత్రి పదవులు ఇవ్వటానికి బీజేపీ ఓకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై జేడీఎస్ ఎలాంటి ప్రకటన చేయలేదు. బీజేపీ కూడా ఇంకా స్పందించలేదు. బలనిరూపణకు బీజేపీకి అవకాశం వస్తే మాత్రం.. జేడీఎస్ లో చీలక ఖాయంగా కనిపిస్తుంది.

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy