కన్నుల పండువగా ఐనవోలు మల్లన్న జాతర

komurellij ataraవరంగల్ జిల్లా ఐనవోలు మల్లన్న జాతర గ్రాండ్ గా జరుగుతోంది. భక్తుల మొక్కులతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది.శివసత్తుల పూనకాలు, ఓగ్గు కళాకారుల నృత్యాలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నాయి. సంక్రాంతి నుంచి ఉగాది వరకూ జరిగే ఈ జాతరకు అన్ని ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంలోనే ప్రముఖ శైవక్షేత్రాల్లో ఒకటిగా నిలుస్తున్న ఐనవోలు శ్రీ మళ్లికార్జున స్వామివారి వార్షిక ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మేడారం తర్వాత అతిపెద్ద గిరిజన జాతరగా ఐనవోలు గుర్తింపుపొందింది. యాదవుల ఇలవేల్పుగా కొలిచే ఐనవోలు మల్లన్నను ఏటా లక్షల సంఖ్యలో భక్తులు సందర్శిస్తారు. సంక్రాంతి నుంచి ఉగాది వరకు సాగే ఉత్సవ జాతరకు భక్తులు క్యూకట్టారు. రాత్రి పూట విద్యుత్ దీపాల వెలుగులో ఆలయం మెరిసిపోతోంది. శివసత్తుల పూనకాలు,ఓగ్గు పూజారుల ఆటపాట,డోలు వాయిద్యాలతో ఐనవోలు అట్రాక్షన్ గా మారింది. గజ్జెల లాగులు,నెత్తిన బోనం,చేతిలో చర్నాకొలాతో భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. మరోవైపు పురుషులు మహిళల వేషం వేసుకుని స్వామి,అమ్మవార్లకు నైవేద్యం సమర్పించడం ఇక్కడ ఆచారంగా వస్తోంది. తమను చల్లంగా చూడాలంటూ… మల్లన్నను వేడుకుంటున్నారు భక్తులు. బోనాలు చేయడం, పట్నాలు వేయడం…ఒగ్గు పూజారుల ద్వారా మొక్కులు చెల్లించడం ఇక్కడ అనవాయితీగా వస్తోంది. ఐనవోలు వచ్చేభక్తుల్లో చాలా మంది సంతానం కోసం మొక్కుబడిగా టెంకాయ బంధనం కట్టడం ఇక్క స్పెషల్. గండాలు తీరితే గండదీపం పెడతామని, కోరికలు తీరితే కోడెను కడతామని, పంటలు పండితే పట్నాలు వేస్తామని మొక్కుకుని…. జాతర సమయంలో వాటిని స్వామికి వారికి చెల్లిస్తారు భక్తులు. కోరిన కోరికలు తీర్చే మల్లన్న దర్శించుకోవడం తమ అదృష్టం అంటున్నారు భక్తులు . ఇక సంక్రాంతి పండగ సందర్భంగా ఆలయంలో మార్నేని వంశస్తులు రథాన్ని పునరుద్దరించి ఆలయ ప్రదక్షణ చేయడం జాతరలో మరో విశిష్టత. ఈ సందర్భంగా కుక్కులకు కొట్లాట పెట్టడం,చల్లకుండలు ఎత్తడం,తలబంగారి పెట్టుకుని మొక్కులు చెల్లించడం సంప్రదాయంగా వస్తోంది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy